తొలి టెస్టు గెలుపు.. ఆస్ట్రేలియా క్రికెట్‌కు భారీ నష్టం
యాషెస్ 2025 సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వచ్చిందట. రెండు రోజుల్లోనే ఆట ముగియడంతో ఈ నష్టం వాటిల్లింది.
యాషెస్ 2025 సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ట్రావిస్ హెడ్(Travis Head) విధ్వంసకరమైన బ్యాటింగ్ తో మ్యాచ్ రెండో రోజే ముగిసింది. దీంతో ఐదు మ్యాచుల యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించడం సంతోషమే అయితే.. మరోవైపు ఆసీస్ బోర్డుకు మాత్రం భారీ నష్టాన్ని తీసుకొచ్చింది.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(financial loss Cricket Board)కు ఆదాయ పరంగా భారీ నష్టాన్ని చూసింది. గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. రెండు రోజుల్లో ఆడ ముగియడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 3 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు నష్టాన్ని చవిచూస్తోంది. పెర్త్ టెస్టులో మొదటి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 101,514 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. తొలి రోజు(శుక్రవారం) 51,531 మంది, రెండో రోజు(శనివారం) 49,983 మంది హాజరయ్యారు. 3, 4వ రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా అంచనా వేసింది. కానీ బౌలింగ్ లో మిచెల్ స్టార్క్, బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ ఆట ముందుగానే ముగిసేలా చూశారు. దీంతో ఆదివారం, సోమవారం మ్యాచ్ చూసేందుకు టికెట్ బుక్ చేసుకున్న వారికి నిరాశే ఎదురైంది.శనివారం మ్యాచ్ ముగిసిన అనంతరం సెవెన్ నెట్‌వర్క్‌తో ట్రావిస్ హెడ్(Travis Head) మాట్లాడుతూ.. ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపాడు. ఆదివారం టికెట్ బుక్ చేసుకున్న ప్రేక్షకులు తనను క్షమించాలని కోరాడు. మరోవైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రీఫండ్ పాలసీ ప్రకారం.. మిగిలిన మూడు రోజులకు టిక్కెట్లను ఇప్పటికే బుక్ చేసుకున్న వారి వారి డబ్బులుకి తిరిగి చెల్లించనుంది. ఈ విధంగా రెండు రోజుల్లోనే ఆట ముగియడంతో, మూడు రోజుల ఆటకు సంబంధించిన భారీ రెవెన్యూను ఆస్ట్రేలియా బోర్డు(Cricket Australia) కోల్పోయింది. ఈ విధంగా మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఆర్ధికంగా మాత్రం భారీ నష్టం చేకూరిందని నిపుణులు చెబుతున్నారు.
