ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి.

మహానీయుల ఆశయాలను భావజాలాన్ని గ్రామాల్లో ప్రజలకు తెలియజేయాలి

రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

దేశ వ్యాప్తంగా దళితులపై మహిళలపై జరుగుతున్న సంఘటనలు అరికట్టుటలో కేంద్ర రాష్ట్రప్రభుత్వాలువిఫలమైనాయని వాటిని ఎదుర్కోవడానికి మరియు*అంబేద్కర్ పాటు మహానీయుల ఆశయాలను భావజాలాన్ని* ముందుకు తీసుకెళ్లడానికి అంబేద్కర్ యువజన సంఘాలను బలోపేతం చేయాలని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య అన్నారు.
గురువారం రోజున జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళ పెల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు మంగళ పెళ్లి శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుల్ల మల్లయ్య మాట్లాడారు .భారత దేశంలోని అన్ని వర్గాల ప్రజల చీకటి బ్రతుకులో వెలుగులు నింపిన మహానీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. దేశంలో ఉన్నత చదువులు చదివిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అంటరాని తనం ను ఎదుర్కోని పట్టుదలతో భవిష్యత్తు తరాల ప్రజల కోసం సమాన హక్కులను కల్పిస్తూ అందరికీ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం రిజర్వేషన్లు ఓటు హక్కును కల్పించారన్నారు. పల్లెల్లో ప్రపంచ మేధావి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి తో పాటు మహనీయుల ఆశయాలను సిద్ధాంతాలను ఆలోచనలు ప్రజలకు తెలియ పరువాలని అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 31 వరకు గ్రామ గ్రామాన అంబేద్కర్ యువజన సంఘాలను ఏర్పాటు చేసి బలోపేతం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం చిట్యాల మండల కోశాధికారి కనకం తిరుపతి జిల్లా నాయకులు బండార్ రాజు, దొమ్మటి ఓదెలు, బొచ్చు నరసయ్య, సంపత్, సదానందం, భూమి రెడ్డి, సుమంత్, తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version