నల్గొండ జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ ప్రారంభించిన: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.

నల్గొండ జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ ప్రారంభించిన: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.

చిలుకూరు, నేటిధాత్రి:

మండల కేంద్రం లో నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్య శాఖను ఏర్పాటు చేశారు. సోమవారం శాఖను స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిలుకూరు మండల కేంద్రంలో శాఖను ఏర్పాటు చేయడం వల్ల ఈ బ్యాంకు ద్వారా ఈ ప్రాంత రైతులకు ప్రయోజనం కలగడంతో పాటు లాభం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఈ బ్యాంకు ద్వారా లభించే రుణాలు ఇతర ఆర్థిక సేవలు నేరుగా రైతులకు చేరడం వల్ల వారికి సాగు పనుల్లో వెసులుబాటు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు గ్రామ సర్పంచ్ కొల్లు పుల్లమ్మనాగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కీతా వెంకటేశ్వర్లు, పెండ్రాతి హనుమంతరావు, ఎడవల్లి పుల్లారావు, బ్యాంకు ఉన్నతాధికారులు స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version