పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసిన ట్రస్ట్…

పేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేసిన ట్రస్ట్

నడికూడ,నేటిధాత్రి:

హుజురాబాద్ కు చెందిన గంగిశెట్టి మధురమ్మ మెమోరియల్ ట్రస్ట్ వారు హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని చర్లపల్లి గ్రామంలో గల పేద వృద్ధ మహిళలకు బండి రేణుక- శంకర్ చేతుల మీదుగా ట్రస్టు నిర్వాహకులు గంగిశెట్టి జగదీశ్వర్ చీరలను పంపిణీ చేశారు.మంచానికే పరిమితమై నడవలేని దీనస్థితిలో ఉండి ఎలాంటి ఆధారం లేని 12 మంది వృద్ధ మహిళల ఇండ్లకు స్వయంగా వెళ్లి చీరలు పంపిణీ చేయడం జరిగింది.వీరికి ప్రతిరోజు భోజనాలు సర్పంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుసుకుని మేము చీరలు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగినదని గంగిశెట్టి మధురమ్మ ట్రస్ట్ సభ్యులు జగదీశ్వర్ తెలిపారు.సర్పంచ్ బండి రేణుక శంకర్ మాట్లాడుతూ మధురమ్మ ట్రస్ట్ సేవలు అమోఘమని మా గ్రామ వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేయడం సంతోషకరమని ఈ సందర్భంగా మా గ్రామం, వృద్ధుల తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలోగ్రామ యువకులు రమాకాంత్, పొన్నం చారి,గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version