జాతీయఉపాధి హామీ పథకం సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను సర్పంచ్ చాట్ల విజయ-రవీందర్ దంపతులు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మండల కేంద్రంలోని అంకుషాపురం గ్రామానికి వెళ్లే దారిలో పంటలకు నీరందించే కాలువలో ఉపాధి హామీ పనులలో భాగంగా పూటికతీత పనులను చేపట్టారు. సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనులు చేసి తనపై విశ్వాసంతో సర్పంచ్ బాధ్యతలు కట్టబెట్టిన గ్రామ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని గ్రామ సర్పంచ్ చాట్ల విజయ రవీందర్ తెలిపారు . ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకొని ఉపాధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నరేష్ కూలీలు పాల్గొన్నారు
