మూడు చింతలపల్లి పై బిఆర్ఎస్ జెండా ఎగర వేస్తాం..

మూడు చింతలపల్లి పై బిఆర్ఎస్ జెండా ఎగర వేస్తాం : మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి

* జగన్ గూడా, ఉద్దమర్రి లో ఎన్నికల ప్రచారం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

మూడు చింతలపల్లి మున్సిపల్ కోట పై బిఆర్ఎస్ జెండా మాజీమంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మేడ్చల్ నియోజకవర్గం ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సంపన్ బోల్, జగన్ గూడ, ఉద్దమర్రి గ్రామాలలో బుధవారం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. భారీ ఎత్తున్న రోడ్ షో నిర్వహించి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించలని కోరారు. ఉద్దేమర్రి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమలలో ఇంచార్జ్ గజ్జెల నాగేష్, యువనాయకులు డాక్టర్ భద్ర రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ గౌడ్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నవీన్, బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version