పరకాలను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి

పరకాలను అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా

నూతన మున్సిపాలిటీ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి

మున్సిపాలిటీ కార్మిక సిబ్బందికి కొట్టబట్టల పంపిణీ

అనంతరం మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన,మెప్మా ఫుడ్ స్టాల్ ల సందర్శన

పరకాల నేటిధాత్రి

మంగళవారం పరకాల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో వన మహోత్సవంలో భాగంగా అధికారులతో కలిసి మొక్కలను నాటి జెసిబి,6 స్వచ ఆటోలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్,అధికారులతో కలిసి శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ ను అధికారులతో కలిసి సందర్శించి మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాల సందర్శన స్టాల్ ను పరిశీలించి అనంతరం మున్సిపల్ కార్మిక సిబ్బందికి బట్టలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంగా అభివృద్ధి చెందాల్సిన పరకాల గత పాలకుల వైఖరి వల్ల నిరాధారణకు గురైందని పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కృషి చేస్తున్నానన్నారు.పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయబోతున్నామని,త్వరలో సెట్విన్ రాబోతుందని,టి యుఎఫ్ఐడిసి నిధులతో డిపిఆర్ ద్వారా అభివృద్ధి చేస్తున్నామన్నారు.త్వరలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని ఇప్పటికే నలభై కోట్లతో డ్రైనేజీ,దాదాపు 11 కోట్లతో రోడ్ల అభివృద్ధి చేస్తున్నామన్నారు.ప్రజల సహకారంతోనే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని,ప్రజలు పరిశుభ్రత పాటించి పారిశుద్ధ్యంను పరిష్కరించడంలో భాగస్వాములు కావాలన్నారు. పరకాలకు పూర్వ వైభవం తీసుకురావడంలో ప్రజలు సహకరించాలని కోరారు.మహిళలను కోటీశ్వరులు చేయడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని,రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,నివాస గృహాలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు సరఫరా,రైతు భరోసా,2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ, యువతకు రాజీవ్ యువ వికాసం,మహిళలకు వడ్డీ లేని రుణాలను,ఇతర సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు,మున్సిపాలిటీ ఆశీకారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version