నర్సంపేటలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయే.
జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్
రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపాలో చేరికలు.
నర్సంపేట,నేటిధాత్రి:
రాబోయే రోజుల్లో రాజకీయంగా నర్సంపేటలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయే అని వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు.త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నిక నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ ఎన్నికల వార్డు ఇన్చార్జుల పోటీకి సిద్ధమైన అభ్యర్థుల విజయ సంకల్ప సభ బిజెపి పట్టణ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్,నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి శ్రీమతి రావు పద్మ, జిల్లా ఎన్నికల కో కన్వీనర్ కంభంపాటి పుల్లారావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలుపుతూ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి ప్రతి ఇంటికి చేరవేసేలా ప్రతి కార్యకర్త కంకణబద్ధంగా పనిచేయాలని సూచించారు. బిజెపికి 60 శాతం ఓట్లు వేయించే విధంగా ప్రణాళిక చేసుకోవాలని కోరారు. గతంలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అభివృద్ధికి చేసిన ఉద్యమాలు ప్రజలకు ఒక్కసారి గుర్తుచేసి ఓటు అడగాలని అన్నారు. రాబోవు ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై స్థానిక నాయకులతో కలసి చర్చించారు.
బీజేపీ పార్టీలో భారీగా చేరికలు..
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వపురం 5వ,6వ వార్డులలో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల నుండి యువనాయకుడు అంజపెల్లి రాజు అద్వర్యలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన పార్టీలో చేరగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రావు పద్మ, జిల్లా ఎన్నికల కో కన్వీనర్ కంభంపాటి పుల్లారావులు పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.మున్సిపాలిటీలో కాషాయం జెండా ఎగరడం ఖాయం అని అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని జిల్లా పార్టీ అధ్యక్షులు గంట రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల కో కన్వీనర్ వడ్డేపల్లి నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాబేటి వెంకట్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, గడల కుమార్, కందిమల్ల మహేష్, బాల్నే జగన్,జిల్లా కార్యదర్శులు గుడుపూడి రాధాకృష్ణ, గోకే వెంకటేష్, మంద శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎర్రగోల్ల భరత్ వీర్, మండల అధ్యక్షులు గూడూరు సందీప్, జిల్లా నాయకులు బండి సాంబయ్య యాదవ్, కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకల రఘునారెడ్డి పొట్టి శ్రీనివాస్ గుప్తా, నియోజకవర్గ నాయకులు శీలం సత్యనారాయణ, జుర్రు రాజు, కొనుముల పృధ్వీరాజ్, పంజర్ల రామ్, పొదిళ్ళ రామచందర్ మరియు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
