సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్ల భయం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లాలో చైన్ స్నాచర్ల ఆగడాలు పెరిగిపోయాయి. ఒంటరిగా వెళ్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులు దొంగిలిస్తున్నారు. ఇటీవల గడ్డపోతరం పరిధిలో జరిగిన ఘటన మరువకముందే, జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శనగర్ లో కంప్యూటర్ క్లాస్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న శ్రావణి అనే మహిళ మెడలోని సుమారు 3 తులాల బంగారు గొలుసును బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు దొంగిలించారు. ఈ ఘటనలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో దొంగల బెడద పెరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
