ధనుర్మాస ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే మురళి నాయక్
వైభోగంగా శ్రీ గోదా రంగనాథ స్వాముల కళ్యాణ మహోత్సవం
కేసముద్రం/ నేటి ధాత్రి
శ్రీ భూ నీలా సమేత వేంకటేశ్వర స్వామి దేవస్థానం లో నిర్వహించిన ధనుర్మాస ఉత్సవాలలో నేడు శ్రీగోదా రంగనాథ స్వాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మహబాద్ శాసన సభ్యులు డా” భూక్యా మురళీనాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ బండారు వెంకన్న, గోపా డివిజన్ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్,మాజీ సర్పంచ్ బట్టు శ్రీనివాస్,సతీష్,దేవస్థాన ధర్మకర్తలు వోలం రాజేశ్వర్ రావు,కృష్ణమూర్తి,చిదురాల వసంతరావు,తేరాల సమ్మయ్య కళ్యాణం లో దేవస్థాన అధ్యక్షులు వోలంమురళీ కోశాధికారి కోయగూరి యాకూబ్ రెడ్డి,సెక్రటరీ బచ్చు పరమేశ్వర్ ,బాణాల నాగరాజు శ్రీరాం సంతోష్ పోకల శ్రీనివాస్,కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, సామ సుధాకర్ రెడ్డి,తరాల వీరేష్ యాదవ్, కత్తెరసాల శ్రీనివాస్, కాటం రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
