అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం
ప్రజల్లో అవగాహన పెంపుపై దృష్టి
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో అగ్నిప్రమాదాల నివారణ అవగాహన కార్యక్రమం అగ్నిమాపక అధికారి భద్రయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా అగ్నిమాపక విభాగం అధికారులు ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు.ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న ప్రారంభమయ్యే అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా ఈ ఏడాది కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.1944 ఏప్రిల్ 14న ముంబై నౌకాశ్రయంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ ఈ వారోత్సవాలను నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.గృహాలు,కార్యాలయాలు,వ్యాపార స్థలాల్లో అగ్ని ప్రమాదాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,విద్యుత్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు,గ్యాస్ సిలిండర్ల వినియోగంలో భద్రతా ప్రమాణాలపై సూచనలు అందిస్తున్నారు.ఏప్రిల్ 14 నుండి 20 వరకు కొనసాగనున్న ఈ వారోత్సవాల్లో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు,ప్రదర్శనలు,శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు.విద్యార్థులు,యువత,వ్యాపారవేత్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించుకోవాలని అధికారులు సూచించారు.అత్యవసర పరిస్థితుల్లో అగ్నిమాపక శాఖను సంప్రదించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండి భద్రతా నియమాలను పాటించాలని ఏమైనా ప్రమాదాలు 8712699306 గల నెంబర్ కి సంంప్రదించాలని అధికారులు కోరారు.
