రాసమల్ల కృష్ణ కి ఉత్తమ రేడియోగ్రాఫర్ అవార్డు
పరకాల,నేటిధాత్రి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించినటువంటి రేడియోగ్రాఫర్ రాసమల్ల కృష్ణ ని జిల్లాకలెక్టర్ స్నేహ శబరిష్ మరియు ఉన్నతఅధికారులు ఉత్తమ రేడియోగ్రాఫర్ అవార్డును ఇచ్చి ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా కృష్ణ మాట్లాడుతూ పేదల పట్ల చూపిస్తున్న ప్రేమను మరియు వారి సేవలను గుర్తించి అవార్డును అందుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందనిఇలాగే నిర్వీరమంగా నిరంతరం పని చేస్తూ పేదప్రజలకు నా వంతు సహాయసహకారాలు ఎల్లవేళలా అందిస్తానని అలాగే ఈ అవార్డును నేను అందుకోవడం ఎంతో సంతోషమని అన్నారు.
