గృహ జ్యోతి పథకం: ఏడాది అయినా లబ్ధిదారులకు ప్రయోజనం అందలేదు…

గృహ జ్యోతి పథకం: ఏడాది అయినా లబ్ధిదారులకు ప్రయోజనం అందలేదు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలంలో గృహ జ్యోతి పథకం కింద దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారులకు ఏడాది గడిచినా ఇప్పటికీ ప్రయోజనం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రజా బాట” కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలనలో లో వోల్టేజ్ సమస్యలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారి బాలకృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ చారి, బీఆర్ఎస్ నాయకుడు ప్రవీణ్ కుమార్, సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version