జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం.
#పూలే ఆశయాలను సాధించాలంటే బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి.
#బి హెచ్ ఎస్ ఎస్ జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి.
నల్లబెల్లి,నేటిధాత్రి :
అగ్రవర్ణబ్రాహ్మణీయసమాజంలోని అంటరానితనం,వివక్ష,అధిక వడ్డీ,దోపిడికీ వ్యతిరేకంగా, పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను సాధించాలంటే ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారంలోకి రావడం ద్వారానే సాధ్యమవుతుందని బీసీ హక్కుల పోరాడ సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. శుక్రవారం మండల కేంద్రలో గ్రామ పంచాయతీ ఆవరణలో జ్యోతి రావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి ఘణనివాళి అర్పించారు అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ సమాజంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను నిర్మించిన మనువాద బ్రాహ్మణీయ ఆధిపత్య శక్తులు వందల ఏండ్లుగా అస్ప్రుశ్యులుగా , అంటరాని వారిగా గుడికి బడికి, భూమికి దూరంగా నెట్టేసిన శూద్రుల హక్కుల కోసం జ్యోతి రావు పూలే దంపతులు తమ జీవితాలను త్యాగం చేశారన్నారు. అగ్రవర్ణ ఆధిపత్య దోపిడి అంతం కావాలంటే.శూద్రులువిద్యావంతులు కావడమొక్కటే మార్గమనీ అందుకోసం పాఠశాలలు ఏర్పాటు చేసి మహిళలతో సహా విద్య నేర్పారన్నారు. సాహు మహారాజ్ ద్వారా 1902లోనే కొల్హాపూర్ సంస్థానంలో 50 శాతం రిజర్వేషన్లుఅమలుచేయించారన్నారు. నేటికీ ఎస్సీ ఎస్టీ బీసీలను విద్యకు, వైద్యానికి ఉపాధికీ దూరం చేసే కుట్రలను అగ్రవర్ణపు ఆధిపత్య రాజకీయ పార్టీలు కొనసాగిస్తున్నారన్నారు. విద్యా వైద్యం, ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన జరుపుతున్న పాలకుల స్థానంలో బహుజనులు రాజ్యాధికారం సాధించడంతోనే జ్యోతి రావు పూలే ఆశయాలను సాధించినట్టు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు పరికి కోర్నేలు, బొట్ల ప్రతాప్ , నాగెల్లి ప్రకాష్ , సిపిఐ మండల కార్యదర్శి కడియాల క్రాంతి కుమార్ , కనుక o ఎల్లయ్య కాంగ్రెస్ నాయకులు కొండి అశోక్,పొడేటి కిషోర్ ,సామేల్ తదితరులు పాల్గొన్నారు
