పాక్ క్రికెటర్లు అలాంటి ప్రదేశంలో నడుస్తున్నారేంటి..

అయ్యో.. పాకిస్థాన్ టీమ్‌కు ఎలాంటి గతి పట్టింది.. పాక్ క్రికెటర్లు అలాంటి ప్రదేశంలో నడుస్తున్నారేంటి..

కొలంబోలో మ్యాచ్ ప్రాక్టీస్ అనంతరం తిరిగి హోటల్‌కు వెళ్తున్న పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ జట్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అందిస్తున్న ఆతిథ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ప్రస్తుతం జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ కోసం శ్రీలంకలో ఉంది. ఈ రోజు (మంగళవారం) సాయంత్రం కొలంబోలో జరగబోయే మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది. కొలంబోలో మ్యాచ్ ప్రాక్టీస్ అనంతరం తిరిగి హోటల్‌కు వెళ్తున్న పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాక్ జట్టుకు శ్రీలంక క్రికెట్ బోర్డ్ అందిస్తున్న ఆతిథ్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి (Pakistan team in Colombo).
వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. పాక్ ఆటగాళ్లు, సిబ్బంది బస్సు నుంచి దిగి, అపరిశుభ్రంగా కనిపిస్తున్న ప్రాంతం నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. పాక్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌ సెషన్ కోసం వెళ్తున్నారా లేదా ప్రాక్టీస్ నుంచి హోటల్‌కు తిరిగి వస్తున్నారా అనే విషయంలో మాత్రం పూర్తి క్లారిటీ లేదు. పాక్ ఆటగాళ్లకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి.. ‘పాక్ క్రికెట్ జట్టుకు కొలంబోలో శ్రీలంక, ఐసీసీ అందించిన ఆతిథ్యం ఇది. వారు సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది’ అని కామెంట్ చేశారు

బిఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే…

బిఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాణిక్ రావు ,డీసీఎంస్ చైర్మన్ శివ కుమార్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జి దేవి ప్రసాద్ మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్,మాజి డి ఆర్ యు సి సి మెంబర్ షేక్ ఫరీద్,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,న్యాల్కల్ మండల పార్టీ అధ్యక్షులు రవీందర్,సీనియర్ నాయకులు నామ రవికిరణ్,ఆర్ సుభాష్,కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు, నాయకులు మాట్లాడుతూ జహీరాబాద్, కోహిర్ మున్సిపల్ లో బిఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు . 37 వార్డులలో బడుగు, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులకు బిఆర్ఎస్ టికెట్లు ఇచ్చామని తెలిపారు. 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహిళలు, వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకపోవడంతో ప్రజలు మళ్లీ కేసీఆర్ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జహీరాబాద్, కోహిర్ లో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version