*అరుణోదయ రాష్ట్రస్థాయి సదస్సు
జయప్రదం చేయాలి*
నర్సంపేట,నేటిధాత్రి:
ఈనెల 19 న ఇల్లందులో జరుగు అరుణోదయ రాష్ట్రస్థాయి సదస్సు
జయప్రదం చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర నాయకులు ఇట్టబోయిన రవి, గుర్రం అజయ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా పట్టణంలోని సిపిఐ ఎం ఎల్ న్యూడెమోక్రసీ కార్యాలయంలో సదస్సు కరపత్రాల ఆవిష్కణ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పక్కనపెట్టి కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారులకు ప్రజా సంపాదన దోచిపెడుతూ ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకచ్చి అనేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.
అడవి ప్రాంతంలో పోలీసు మిలిటరీ బలగాలతో అడవిలో నివసిస్తున్న ఆదివాసులను హింసించి చంపుతున్నారని ప్రశ్నించే మేధావులను జైల్లో నిర్బంధిస్తున్నారని, కళాకారులుగా వ్యతిరేకించవలసిన అవసరం ఉందన్నారు. భారత రాజ్యాంగంలోనే హక్కుల కోసం నిర్వహించే ఉద్యమానికి ప్రజలంతా ఆసరాగా నిలవాలని జులై 19 న ఇల్లందులో జరుగు రాష్ట్రస్థాయి అరుణోదయ సదస్సును జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రవితేజ,ఉషాకిరణ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.