పారదర్శకంగా లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్
సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )
పారదర్శకంగా లబ్దిదారులకు లాటరీ పద్ధతిలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.శుక్రవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ ముస్తాబాద్ మండల కేంద్రం మాతృశ్రీ గార్డెన్స్ లో ముస్తాబాద్ , గూడెం, కొండాపూర్ ఇందిరమ్మ ఇండ్ల లాటరీ కేటాయింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, 94 ఇందిరమ్మ ఇండ్లను లబ్దిదారులకు లాటరీ పద్ధతిలో పారదర్శకంగా కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు నేడు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు ప్రొసీడింగ్స్ అందిస్తామని, ఇండ్లు పోందిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.కొండాపూర్ ఇందిరమ్మ ఇండ్ల వద్ద రోడ్డు, ప్లంబింగ్ పనులు నిర్మించాల్సి ఉందని వీటి నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలు కలెక్టరేట్ నిధుల నుంచి మంజూరు చేసి నెల రోజుల లోపు పూర్తి చేస్తామని అన్నారు.ఇందిరమ్మ ఇండ్ల వద్ద మౌలిక వస్తువుల కల్పనకు ఇసుక, మోరం (మట్టి) సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కూడా వేగవంతంగా లబ్ధిదారులు పూర్తి చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు ఆన్ లైన్ లో అప్ డేట్ చేస్తూ సంబంధిత లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు.
పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో సాండ్ ట్యాక్సీ విధానం అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 200 మంది యువకులకు వాహనాలు అందించే వారి ద్వారా ఇసుక మట్టి తరలింపుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అనంతరం గూడెం గ్రామం పరిధిలోని నూతనంగా కేటాయించిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేసి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కేకే మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ తాలారీ రాణి పీడీ,హౌసింగ్ శంకర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేషాద్రి, మండల ప్రత్యేక అధికారి ఎంఏ భారతి, తాసిల్దార్, ఎంపీడీవో సంబంధిత అధికారులు, సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.