సీసీఐ తేమ శాతం లేకుండా పత్తి కొనుగోలు చేయాలి.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండల కేంద్రంలోని బాల మృర్ గన్ జీన్నింగ్ మిల్లు ను సిసిఐ ని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రోజున సందర్శించిన చిట్యాల మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ యాదవ్ బిఅర్ఎస్ మండల అధ్యక్షలు అల్లం రవీందర్ అనంతరం వారు మాట్లాడుతూ.
అకాల వర్షం కారణంగా నష్టపోయిన పత్తి రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి.
రైతుల నుండి సీసీఐ కేంద్రం వారు మరియు అధికారులు యాజమాన్యాలు కుమ్మక్కై రైతుల నుండి క్వింటాలుకు 10 కిలోల చొప్పున దోపిడీ చేస్తున్నారు.
వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు సీసీఐ వారు తేమ శాతం లెక్కచేయకుండా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అల్లం రవీందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ మండల ప్రధాన కార్యదర్శి మడికొండ రవీందర్రావు, మండల యూత్ ప్రెసిడెంట్ తౌటం నవీన్, టౌన్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీధర్ మండల్ నాయకులు సాదా మల్లయ్య పాండాల వీరస్వామి, పెరుమాండ్ల రవీందర్, ఏలేటి రాజు పర్లపల్లి భద్రయ్య,దామెర రాజు నోముల నాగరాజు మరి నరేష్ శ్రీనివాస్ తదితరులు.
