ఎక్స్ ఎంపీపీ నారాయణ రెడ్డిని మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శ
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జహీరాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ ఇంచార్జ్ సిద్ధంరెడ్డి నారాయణ్ రెడ్డి హైదరాబాద్ లోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమాచారం తెలుసుకొని స్వయంగా వెళ్లి పరామర్శించారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్స్ ను, వారి కుమారుడు జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఉజ్వల్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నారు. నారాయణ రెడ్డి త్వరగా కోలుకోవాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆకాంక్షించారు.జహీరాబాద్ నియోజకవర్గ చరక్ పల్లి గ్రామ ప్రజలకు సేవలందించిన నాయకులుగా పేరు పొందిన నాయకులు నారాయణ రెడ్డి త్వరగా కోలుకోవాలని జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ నాయకులు కోరుకుంటున్నారు,
