టీ.యూ. సీ.ఐ 140వ మేడే వర్థిల్లాలి
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి పట్టణంలోని కార్మిక సంఘo ఆధ్వర్యంలో దురాక్రమణ యుద్ధం భారాలకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కోడ్ రదుకై ఉద్యమిద్దాం 8గంటల పని దినం అమలు చేయాలని పనికి తగిన ప్రతిఫలం ఇవ్వాలిని పెట్టుబడి దారుల శ్రమ దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన రోజే మే డే.1886సం.లో మే1న శ్రామిక వర్గ. కార్మిక వర్గ పోరాట దినంగా పాటించాలని నిర్ణయించాయి . 4లేబర్ కోడ్ లను వ్యతిరేకిదాం ఉపాధి హామీ పథకంలో తెచ్చిన వికసిల్ జీ-రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని . 2025 విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరణ కోవాలి కనీసం వేతనం రూ 26000 కార్మిక కనీసం 10000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతి శీల రైస్ మిల్లు కార్మిమిక సంఘం కల్వకుర్తి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టీ యు సి ఐ .ఎ.ఆంజనేయులు జెండా ఎగురవేసినారు.కార్మిక సంఘం అధ్యక్షుడు ఎ.సాయి బాబా ఉపాధ్యక్షులు మొగులాలు, కోశాధికారి మల్లేష్, మార్కెట్ చాట అధ్యక్షురాలు వేంకటమ్మ, బాలమణి,వేంకటయ్య,బాల్చంద్రి, l శ్రీను,గాసిరాం,రుకునమ్మ, తదితరులు పాల్గొన్నారు.
