మే డే పోరాట దినంగా పాటించండి!
మేడే సందర్భంగా భారీ ర్యాలీ
భూపాలపల్లి నేటిధాత్రి
కేంద్రంలో మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుండి నేటి వరకు కార్మిక వ్యతిరేక విధానాలను నిరంతరం అమలు చేస్తోంది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం వంద సంవత్సరాలుగా కార్మికులు సాధించిన అనేక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను తీసుకొచ్చింది. మే డే సందర్భంగా కార్లర్స్ కాలనీ సీఐటీయూ జిల్లా ఆఫీసు నుండి గణేష్ చౌక్ పోలీస్ స్టేషన్ రోడ్డు జిఎం ఆఫీస్ మీదుగా కార్ల మార్క్స్ కాలనీ వరకు భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం ఆకుదార రమేష్ అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా అధ్యక్షులు బందు సాయిలు హాజరై అనంతరం మాట్లాడుతూ
ప్రపంచ కార్మిక వర్గంతో పాటు భారత కార్మిక వర్గం ఎన్నో త్యాగాలు చేసి సాధించిన 8 గంటల పని దినం, సమ్మె హక్కు, జీత భత్యాలు, సంక్షేమ పథకాలు వంటి హక్కులు ప్రమాదంలో ఉన్నాయి. కార్మిక చట్టాల స్థానంలో లేబర్ కోడ్‌లు వచ్చాయి.
1886 చికాగో కార్మికుల పోరాటం స్ఫూర్తితో మే డేను పోరాట దినంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా 2026 మే 1 నుండి 7 వరకు మే డే వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సిటూ పిలుపునిస్తోంది.
మే డే పోరాట దినంగా పాటించండి!
1886లో చికాగోలో 8 గంటల పని దినం కోసం కార్మికులు చేసిన పోరాటంలో పలువురు నాయకులు ప్రాణత్యాగం చేశారు. ఆ పోరాట ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కులు స్థాపించబడ్డాయి. వారు అన్నారు ఈ కార్యక్రమంలో
గుర్రం దేవేందర్,గడప శేఖర్, విజయలక్ష్మి, తోట రమేష్, కుమ్మరి శీను, గుగులోతు శ్రీకాంత్, మడికొండ స్వామి, కోకిల ఆనందు, సంపతు, సిహెచ్ రవికుమార్, మేకల మహేందర్, మునుకుంట రాజేందర్, కొండ లక్ష్మి, నక్క స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.
