బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
నర్సంపేట, నేటిధాత్రి:
బాలాజీ విద్యాసంస్థలలో భాగమైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్‌లో బుధవారం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ ఏ.వనజ హాజరయ్యారు. చైర్మన్ మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో పిల్లలు మొబైల్ ఫోన్స్, తదితర వాటికి దూరంగా ఉండటానికి ఏప్రిల్ 29 నుంచి మే 25 వరకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమయాన్ని వృథా చేయకుండా సద్వినియోగ పరుచుకునేలా ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో డ్యాన్స్, అబాకస్, యోగా, భగవద్గీత, బాస్కెట్ బాల్, వాలీబాల్, కరాటే, క్రికెట్, చెస్, క్యారమ్, లూసిడా హ్యాండ్ రైటింగ్ వంటి ఆర్ట్ & క్రాఫ్ట్ అంశాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సెక్రెటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, బాలాజీ టెక్నోస్కూల్ ప్రిన్సిపాల్ పి.రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి, అక్షర ద స్కూల్ ప్రిన్సిపాల్ జి.భవాని, ఏఓ సురేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
