ఎంపీడీవో గా బాధ్యతలు చేపట్టిన శుభనివాస్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
నల్లబెల్లి ఎంపీడీవో గా తొర్రూరు పట్టణానికి చెందిన జె శుభ నివాస్ నూతనంగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఎంపీడీవో గా విధులు నిర్వహించిన నరసింహమూర్తి పదవి విరమణ పొందడంతో మండల పంచాయతీ అధికారి రవికి ఎంపీడీవోగా సంబంధిత శాఖ జిల్లా ఉన్నత అధికారులు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్స్ లలో ఎంపికైన అభ్యర్థులకు నూతన బాధ్యతలు అప్పగించగా. ఈ మేరకు జే శుభ నివాస్ ఎంపీడీవో గా నల్లబెల్లి మండలంలో మొదటి పోస్టింగ్ లో బాధ్యతలు చేపట్టి విధుల్లో చేరారు. బాధ్యతలు స్వీకరించిన శుభ నివాస్ కు కార్యాలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
