సెల్ టవర్ నిర్మాణం నిలిపి వేయండి
మందమర్రి నేటి ధాత్రి
స్థానిక మందమర్రి ప్రాణహిత కాలనీ ( షిర్కె) లో నిర్మిస్తున్న ఎయిర్టెల్ టవర్ నిర్మాణం ఆపాలని కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కాలనీ కి దగ్గర గా ఉన్నా సోలార్ ప్రాజెక్టు వల్ల కాలనీ వాసులు వేడికి ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు కాలనీ కి అతి దగ్గరగా సెల్ టవర్ నిర్మించడం వల్ల, పిల్లలు రేడియేషన్ కి గురి కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ఏరియా జిఎం గారికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ టవర్ నిర్మాణం గురించి తమకు ఏలాంటి సమాచారం లేదని మున్సిపల్ అధికారులు అంటున్నారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. కాలనీ కి దూరం గా ఈ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు.
