ఠాగూర్ స్టేడియంలో స్టేట్ లెవల్ జూనియర్ గర్ల్స్ ఫుట్బాల్ పోటీలు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఠాగూర్ స్టేడియంలో ఈ నెల 9వ తేదీ నుండి 12 వ తేదీ వరకు జూనియర్ గర్ల్ స్టేట్ లెవెల్ ఫుట్ బాల్ ఛాంపియమా షిప్ పోటీలు నిర్వహించబడునని జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్స్ జనరల్ సెక్రటరీ పిన్నింటి రఘునాథ్ రెడ్డి, క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. స్థానిక స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి క్రీడాకారులు పాల్గొంటారని, పోటీల్లో పాల్గొనే వారికి బోజన వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ పోటీలకు సింగరేణి సంస్థ అన్ని విధాలుగా తోడ్పాటు అందించడం సంతోషదాయకమన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, సీనియర్ క్రీడాకారులు, నాయకులు పాల్గొన్నారు.