‘మెట్రో’పై స్టాలిన్ రాజకీయం చేస్తున్నారు..
మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్ ఆరోపించిన విషయం తెల్సిందే.
మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్ ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్క రాష్ట్రంలోని లేని విధంగా చెన్నై మెట్రో రైల్(Chennai Metro Rail) రెండో దశ ప్రాజెక్టుకు రూ.6326 కోట్లు కేటాయించామన్నారు.
2024 అక్టోబరులో కేంద్రం ఇచ్చిన అనుమతులను ముఖ్యమంత్రి స్టాలిన్ విస్మరించి, 2017లో ప్రతిపాదనలను ఆధారంగా చేసుకుని కోవై, మదురై మెట్రో ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్నారని, ఇది దురదృష్టమన్నారు. కోవై, మదురై మెట్రో రైల్ ప్రాజెక్టులకు అనేక లోటుపాట్లున్నాయన్నారు. చెన్నైతో పోల్చితే కోయంబత్తూరులో మెట్రో ప్రాజెక్టు దూరం చాలా తక్కువని, కానీ, అధిక మొత్తంలో రవాణా సదుపాయాలను ప్రతిపాదించారన్నారు.
