జడ్పిటిసి బరిలో షేక్ రబ్బానీ
◆:- అధిష్టానం అవకాశమిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం కేంద్రమైన మండల కేంద్రనికి చెందిన ఏఐఎంఐఎం పార్టీ నుంచి షేక్ రబ్బానీ జెడ్పిటిసి బరిలోకి దిగేందుకు ఏఐఎంఐఎం తరఫున ముందుకొచ్చారు. పార్టీ అధిష్టానం నుంచి అవకాశం లభిస్తే, ఝరాసంగం మండలాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని సోమవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తెలిపారు. షేక్ రబ్బానీ 2010 లో పార్టీ మండల అధ్యక్షులుగా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజల మధ్య నుంచి వచ్చిన నేతగా, సమస్యలపై బహుళ అనుభవం కలిగి ఉన్నానని, పార్టీ టికెట్ లభిస్తే మరింత విస్తృతంగా సేవలం
దించేందుకు సిద్ధమని అన్నారు. ఝరాసంగం మండలం నుండి జెడ్పిటిసి అభ్యర్థిగా ముగ్గురి పేర్లు ఏఐఎంఐఎం అధిష్టానానికి పంపినట్టు సమాచారం. అందులో తన పేరు కూడా ఉండడం గర్వంగా ఉందని, ప్రజలు ఆశీర్వదిస్తే మరింత సేవ చేసే అవకాశం కోరుతున్నానని పేర్కొన్నారు.