ఎస్ జి ఎఫ్ మొగలపల్లి జోనల్ క్రీడలు విజయవంతం
జోన్ చైర్మన్ మండల విద్యాధికారి లింగాల కుమారస్వామి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.
మొగుళ్ళపల్లి జోనల్ స్థాయి క్రీడోత్సవాలువిజయవంతంగా జరిగాయని ఎస్జీఎఫ్ మొగుళ్లపల్లి జోన్ చైర్మన్ మండల విద్యాధికారి లింగాల కుమారస్వామి తెలిపారు
ఈ సందర్భంగా మొగులపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ చదువు మరియు క్రీడలు విద్యార్థికి రెండు కండ్ల లాంటివని విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను అందుకుంటారని మాట్లాడడం జరిగింది ఎస్ జి ఎఫ్ జోన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుండెల్లి రాజయ్య మాట్లాడుతూ మొగుళ్లపల్లి చిట్యాల టేకుమట్ల మూడు మండలాల నుండి 450 మంది విద్యార్థులు అండర్ 14 అండర్ 17 విభాగాలలో బాల బాలికలు క్రీడోత్సవాలకు హాజరయ్యారని వెల్లడించారు జోనల్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో , ఫిజికల్ డైరెక్టర్లు సూదం సాంబమూర్తి బొమ్మ సందీప్ రెడ్డి సంగినేని పృథ్వీరాజ్ బండి ప్రసాద్ నూకల లింగయ్య గాజర్ల శ్రీనివాస్ మహేష్ అజయ్ స్వరూపారాణి చాగంటి ఆనంద్ సుమత ఉమా వెన్నెల శారద అశోక్ శ్రీనివాస్ సుదర్శన్ నరేష్ సంఘ రఘుపతి తదితరులు పాల్గొన్నారు