కుందారం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం…

కుందారం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం కుందారం గ్రామంలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే కార్యక్రమం శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన శాస్త్రవేత్త డా. యు. స్రవంతి పాల్గొని రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు.యూరియాను సమతుల్యంగా,పంట అవసరాలకు అనుగుణంగా వినియోగించాలని సూచించారు.అలాగే పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల సమర్థ వినియోగం గురించి రైతులకు వివరించారు.మండల వ్యవసాయ అధికారి శివలీల మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సన్నబియ్యం రకాలైన ఆర్ఎన్ఆర్ 15048, కెఎన్ఎం 1638, బిపిటి 5204, డబ్ల్యూ జి ఎల్ 44, హెచ్‌ఎంటీ సోనా,జై శ్రీరామ్ వంటి వరి రకాల సాగు చేయాలని రైతులకు సూచించారు.పంటల విభిన్నీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) వైపు దృష్టి సారించాలని రైతులను ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కే.వినోద, పంచాయతీ కార్యదర్శి విష్ణువర్ధన్, మండల వ్యవసాయ అధికారి శివలీల,మండల ఉద్యాన అధికారి కళ్యాణి,స్థానిక రైతులు పాల్గొన్నారు.కార్యక్రమంలో రైతులు అడిగిన ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సమాధానాలు ఇస్తూ ఆధునిక వ్యవసాయ పద్ధతులపై మార్గనిర్దేశం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version