జర్నలిస్ట్ అనిల్ భగత్ కు భారత రాజ్యాంగ ప్రతిని అందించిన ఎస్సీ,ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్
రామకృష్ణాపూర్,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ.ఎస్టీ కమిషన్ సభ్యులు రెనికుంట్ల ప్రవీణ్ కుమార్ భారత రాజ్యాంగం ఇంగ్లీష్ అనువాదం పత్రం జర్నలిస్ట్ అనిల్ భగత్ కు బహుకరించారు. ఈ సందర్భంగా రేణుకుంట్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతు భగత్ సింగ్ యువజన సంఘం పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జర్నలిస్ట్ గా ప్రయాణం సాగిస్తున్న అనిల్ సోదరసమనులు అని చిన్న వయసులో స్వచ్ఛంద సేవకుడిగా, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ గా, అనేక అవార్డుల అందుకోవడం తోపాటుగా కష్ట నష్టాలు చవిచూస్తున్నారు అని అన్నారు. పేదరికంలో మగ్గిపోతున్న ప్రజల సమస్యలే తన సమస్యగా భావిస్తూ ప్రజల కోసం పరితపించే అనిల్ భగత్ వార్తలకు ప్రజల నుండి అధికారులు ప్రజాప్రతినిధుల వరకు అనేకమంది అభిమానులు ఉన్నారు అని అన్నారు. ఆర్టికల్ 19 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ గురించి గళమెత్తె పత్రికా విలేకరులకు రాజ్యాంగం పట్ల సంపూర్ణ అవగాహన ఉండాలని ఆది వారికి వారి వృత్తికి మాత్రమే కాకుండా ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు.
