*ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటున్న సర్పంచ్
చాట్ల విజయ రవీందర్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో పైప్ లైన్ లీకేజీలు జరిగాయి. దీంతో ప్రజలు మంచినీటికీ కష్టాలు పడకుండా ఉండాలనే దృఢ సంకల్పంతో..ఇటీవలే నూతనంగా సర్పంచ్ గా భాధ్యతలను చేపట్టిన చాట్ల విజయ-రవీందర్ గ్రామపంచాయతీ సిబ్బంది తో మండల కేంద్రంలో ఉన్నటువంటి మంచినీటి పైప్ లైన్ లీకేజీ పనులను చేపట్టారు. ఎంతో ఆదర్శంతో..ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న సర్పంచ్ దంపతుల సేవలు ఎనలేనివని గ్రామస్తులు కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఉడుత మొండయ్య, క్యాతరాజు రాజయ్య, చాట్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు.
