ఘనంగా సంత్ గాడ్గే బాబా వర్ధంతి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరసంగం మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ భారత్ పితామహుడు, సంఘ సంస్కర్త సంత్ గాడ్గే బాబా 69 వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమంలో రజక సంఘం నాయకులు మాట్లాడుతూ సంత్ గాడ్గే బాబా అసలుపేరు దేవీదాస్ దేబూజీ. గాడ్గే బాబా మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అంజన్గావ్ తాలూకాకు చెందిన షేన్గావ్ గ్రామంలోని రజక కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జింగ్రాజీ, సక్కుబాయిలు. వారు రజక కులంలో జన్మించాడు .ఆయన చేసిన సేవాకార్యక్రమాలు గురించి టీ
కులవివక్షపై పోరాటం:
బాబా కులవివక్షను, కులతత్త్వాన్నీ తీవ్రంగా వ్యతిరేకించేవారు. గాడ్గే బాబాను ఎవరైనా మీదే కులం అని ప్రశ్నిస్తే, నేను దళితుణ్ణని సమాధానం చెప్పేవారు. పండరిపూర్‌లో స్వామివారి ఉత్సవాలు వర్షాకాలంలో జరిగేవి. ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు దూరతీరాల నుంచి వచ్చి పాల్గొనే భక్తులతో క్షేత్రమంతా కిక్కిరిసిపోయేది. అప్పట్లో ఆలయ ప్రవేశార్హత లేక కేవలం ఆలయంపై వుండే కలిశాన్ని చూసేందుకు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళే దళిత కులస్తుల ఇక్కట్లు మరీ ఎక్కువగా వుండేవి. వారు విశ్రాంతి తీసుకునేందుకు, బసచేసేందుకు ఏర్పాట్లూ లేవు. వారి ఇబ్బందులను గమనించిన గాడ్గే బాబా భక్తులు, ప్రజల సహకారాలను అర్థించి అక్కడ చొక్క మేళా పేరుతో ఓ ధర్మశాల నిర్మించారు. దళిత భక్తుల కోసం కట్టించిన తొలి ధర్మశాలగా ఇది ప్రఖ్యాతి పొందింది.
జంతు బలులకు వ్యతిరేకంగా పోరాటం:
బాబా తన పర్యటలనలో జంతుబలులను ఖండించేవారు. సంతానం కలిగినపుడు ఇచ్చే జంతుబలులను ఉద్దేశించి ఒక జీవి పుట్టుక సందర్భంగా ఇంకో జీవిని బలి ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించేవారు.
విద్యాభ్యాసమే సమాజంలోని మూఢత్వానికి, వెనకబాటుతనానికి విరుగుడు కాగలదని నమ్మే బాబా తన భక్తులిచ్చిన విరాళాలను వినియోగించి అనేక పాఠశాలలు, వసతి గృహాలు నిర్మించారు. వందకు పైగా పాఠశాలలను ఆయన నెలకొల్పారు.
ఇట్టి కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మణ్,నాయకులు రాములు,రవి,శ్రీశైలం, రాజు,యాదగిరి, శివకుమార్ మరియు మెదపల్లి యువ నాయకులు అభిలాష్ రెడ్డి ,మజార్ తదితరులు పాల్గొన్నారు.
