ముదిగుంట గ్రామపంచాయతీలో శానిటేషన్ పనులు
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామపంచాయతీలో శానిటేషన్ పనులను పూర్తి చేశారు.వర్షాకాలం దృశ్య గ్రామంలోని డ్రైనేజీలు పూడికలని తీసి మురికి కాలువలో,నాళాలలో,బావిలలో క్లోరినేషన్ స్ప్రే చేసి,బ్లీచింగ్ పౌడర్ చల్లారు.ప్రజలందరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని,నీరు నిలువ లేకుండా చూసుకోవాలని,దోమల నివారణ చర్యలను పాటించాలని కార్యదర్శి సురేష్ సూచించారు.అలాగే శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉండకూడదని,పురాతన భవనాలకు,గోడలకు దూరంగా ఉండాలని,విద్యుత్ స్తంభాలను తాకరాదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి సురేష్,పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.