నూగూర్ వెంకటాపురం( నేటి ధాత్రి )
ఫిబ్రవరి 6 ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో
చిరుతపల్లిలో సమ్మక్క గిరిజన ప్రజలు జరుపుకొనే అతి పెద్ద పండగ. ఈ జాతర వెంకటాపురం మండలం బర్లగూడెం గ్రామ పంచాయతీ లోని చిరుతపల్లి గ్రామంలో అంగరంగ వైభవం గా జరగనుంది. ఈ జాతర మొదలు అయినప్పటినుండి ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతి గ్రామంలో జోగు అడిగి చుట్టూ ప్రక్కలా గ్రామాలలో నిద్ర చేస్తుగిరిజన ప్రజల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవలుగా, ఆపదలో ఉన్న వారిని ఆపద్బాంధవులుగా, పూజలందుకుంటున్న సడలమ్మ తల్లి దేవత అని ప్రజల నమ్మకం. ఘనత కేక్కిన ఈ జాతర గిరిజన సంప్రదాయరైతుల్లో జరుగుతుంది. ఈ పండుగకు చుట్టూ ప్రక్కల గ్రామాలలో ప్రజలు కాకుండా మండలంలోని ప్రజలు వేల కొద్దీ భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి మొక్కలు చెల్లించు కుంటారు.పూజారులు, వడ్డే, తలపతి, ఆలయ కమిటీ సమక్షంలో జరుగుతుంది.