బంధువులతో మంత్రి పొన్నం బద్నాం!?

`బంధువుల మూలంగా మంత్రి పొన్నంకు చిక్కులు!

`బంధువుల పనులవల్ల మంత్రికి తలవంపులు!

`మంత్రి పదవే ప్రమాదంలో పడేలా వారి చేష్టలు!

`వాళ్ళ వల్ల మంత్రిని చుట్టూముడుతున్న వివాదాలు!

`సంజాయషి చెప్పుకునే పరిస్థితులు తీసుకొస్తున్న బంధువులు.

`కాంగ్రెస్ లో వున్న తెలంగాణా ఉద్యమ కారులలో పొన్నం అతి ముఖ్య నాయకుడు.

`తెలంగాణ కోసం ప్రాణం పణంగా పెట్టిన పోరాట యోధుడు.

`పార్లమెంట్ సాక్షిగా ప్రాణం పోయే స్థితిని ఎదుర్కొన్న దీరుడు!

`పెప్పర్ స్ప్రే మూలంగా ఆసుపత్రిలో చేరి, ప్రాణాలతో బైట పడ్డ ఉద్యమ కారుడు.

`భవిష్యత్తులో గొప్ప నాయకుడుగా వెలుగొందాల్సిన నాయకుడు పొన్నం.

`బంధువుల మూలంగా వివాదాలలో చిక్కు కుంటుంటున్నారు.

`తన ప్రమేయం లేకున్నా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

`అనవసరంగా విమర్శల పాలవుతున్నాడు.

హైదరాబాద్, నేటిధాత్రి:

నాయకుడుగా ఎదగడానికి ఒక వ్యక్తి నానా కష్టాలు పడతాడు. అవకాశం కోసం ఎళ్ల తరబడి ఎదురుచూస్తారు. అలా జీవితం రాజకీయాలకు అంకితం చేస్తారు. వచ్చినట్లే వచ్చిన అవకాశాలు చేజారుతున్నా, మళ్లీ, మళ్లీ చకోర పక్షిలా ఎదురుచూస్తారు. నిజం చెప్పాలంటే కొన్నిసార్లు నాయకులు పడే కష్టం సామాన్యమైంది కాదు. ప్రజల కోసం ఉద్యమాలు, పోరాటాలు, కేసులు, జైళ్లు లెక్క చేయకుండా జనజీవనంలో వుంటారు. అప్ప్పుడు వారికి ఏ వ్యక్తి తోడుండరు. ఏ బంధువు పకరింపులుండవు. ఎందుకొచ్చిన రాజకీయాలు అని మాట్లాడేవారు కూడా వుంటారు. కాని ఒక్కసారి ఆ నాయకుడు ప్రజా ప్రతినిది అయితే అందరూ మÖగుతారు. మా బందువే అని చెప్ప్పుకుంటారు. ఆ నాయకుడి చుట్టూ చేరుతారు. అందరూ వచ్చి వాలిపోతారు. దగ్గర బంధులైతే ఏకంగా పెత్తనం చేయడం మొదలు పెడతారు. అలా నాయకుడు ఏళ్ల తరబడి కష్టించి తెచ్చుకున్న పేరును బంధువులు, అనుచరులు చెడగొడుతుంటారు. నాయకుడికి అపఖ్యాతి తెచ్చిపెడుతుంటారు. లేని సమస్యలు నాయకుడి నెత్తికి చుట్టేస్తారు. నాయకుడి పేరు చెప్పి చేయకూడని పనులన్నీ చేస్తారు. అంతిమంగా నాయకుడు ఇబ్బందుల పాలౌతాడు. ఇలాంటి సంఘటనలు అనేక మంది నాయకులు ఎదుర్కొంటారు. ఆఖరుకు పదవులు కూడా పోగొట్టుకున్న నాయకులు అనేక మంది వున్నారు. బంధులను నమ్మి మోస పోయిన నాయకులు వున్నారు. వాళ్ల రాజకీయానికి దూరమైన వారున్నారు. అలాంటి పరిస్ధితులు తెలంగాణ ఉద్యమకారుడు, విద్యార్ది రాజకీయాల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు, మాజీ ఎంపి, హుస్నాబాద్ ఎమ్మెల్యే రవాణా, బిసి సంక్షమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎదుర్కొనే ప్రమాదం కనిపిస్తుందని అంటున్నారు. ఈ మధ్య ఆయనకు సంబంధం లేని విషయాల్లోనూ మంత్రి పేరు వినిపిస్తోంది. నిజం చెప్పాలంటే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా సేవ కోసం పడిన కష్టం అంతా ఇంతా కాదు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన నాయకులు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో వుండి కూడా అప్పటి ప్రభుత్వం మీద కూడా ఆయన తిరుగుబాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పార్లమెంటురీ పార్టీ నాయకుడిగా వున్న పదవిని కూడా ఆయన వదులుకున్నారు. అలా పదవులు కూడా త్యాగం చేశారు. అలాంటి నాయకుడు 2014లో ఓడిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఎంతో త్యాగం చేసినా ఆయనను ఓటమి పలకరించింది. అయినా ఆయన ప్రజా తీర్పును గౌరవించి, ప్రజల్లో మళ్లీ గుర్తింపు కోసం ఎంతో ప్రయత్నం చేశారు. పదేళ్లపాటు పార్టీకి సేవ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అటు పార్లమెంటులోనూ, ఇటు క్షేత్ర స్దాయిలోనూ ముందుండి పోరాటం చేdసిన నాయకుడు పొన్నం ప్రభాకర్. తెలంగాణ ఏర్పాటు ఆఖరు ఘట్టంలో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన త్యాగం అంతా ఇంతా కాదు. అది అనుకోని సంఘటన అయినా సరే ప్రాణాలకు తెగించి ముందుకెళ్లారు. పెప్పర్ స్ప్రే కొడుతున్నారని తెలిసినా ఆయన వెరవలేదు. తన ప్రాణం కన్నా తెలంగాణ ఏర్పాటే ముఖ్యమని ధైర్యం చేశారు. సరిగ్గా తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో అప్పటి విజయవాడ ఎంపి లగడపాటి రాజగోపాల్ నిబందనలకు విరుద్ధంగా పార్లమెంటులోకి పెప్పర్ స్ప్రే తెచ్చారు. తెలంగాణ బిల్లు పాస్ కాకుండా అనైతికంగా, అన్యాయంగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏకంగా అప్పటి స్పీకర్ మీరా కుమారి మీద పెప్పర్ స్ప్రే చల్లితే ఆమె మÖర్చతో పడిపోతారు. బిల్లు ఆగిపోతుందన్న కుట్ర చేశారు. ఆ సమయంలో సమైక్య వాదులు స్పీకర్ ముందుకు రాకుండా వలయంగా ఆనాటి తెలంగాణ ఎంపిలు ఏర్పడ్డారు. లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడాన్ని గ్రహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఏకంగా స్పీకర్ మీరాకుమార్ మీద పడకుండా అడ్డుగా నిలిచారు. దాంతో పొన్నం ప్రభాకర్ మీద పెప్పర్ స్ప్రే పడింది. అది పీల్చిన పొన్నం వెంటనే సృహ తప్పి పడిపోయారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులు ఆయన ఆసుపత్రిలో వైద్యం తీసుకోవాల్సి వచ్చింది. ఆసుపత్రిలో చేరినప్ప్పుడు తెలంగాణ అంతా నివ్వెరపోయింది. పొన్నం ప్రాణానికే ప్రమాదం ఎదురయ్యేలా వుందన్న వార్తలు తెలంగాణ ప్రజలను కలిచి వేశాయి. ఎంతో క్రటికల్ వైద్యం తర్వాత ఆయన కోలుకున్నారు. అలా తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన పోరాటయేధుడు పొన్నం ప్రభాకర్. తెలంగాణ కోసం కాంగ్రెస్‌లో ఎంతో మంది ఉద్యమం చేశారు. కాని కాంగ్రెస్‌లో ప్రాణాలను సైతం లెక్క చేయని ఏకైక నాయకుడు పొన్నం ప్రభాకర్. అందుకు ఆయనకు పార్టీ ఎంతో ప్రాదాన్యతనిస్తూ వచ్చింది. గత ఎన్నికల్లో ఆయన హుస్నాబాద్ నుంచి గెలిచారు. మంత్రి అయ్యారు. మంత్రి పొన్నం నాయకత్వమంటే పార్టీ అదిష్టానానికి కూడా అంత గురి. ప్రాణాలకు తెగించి, స్పీకర్ మీరాకుమారిని కాపాడిన పొన్నంను పార్టీ కూడా విస్మరించలేదు. అలా ఆయన సేవలకు ప్రజలు గుర్తింపనిచ్చారు. పార్టీ కూడా ప్రాదాన్యతనివ్వడంతో మంత్రి అయ్యారు. అలా మొదటిసారి ఎమ్మెల్యే, మంత్రి అయిన పొన్నం ప్రభాకర్‌కు సమీప బంధువులు, అనుచరుల మÖలంగా వివాదాలలో చిక్కుకుంటున్నారు. అవి కావాలని పుడుతున్నాయా? లేక బంధువులే తలవంపులు తెస్తున్నారా? అనేది తర్వాత సంగతి. కాని ప్రతిసారి మంత్రి పొన్నం పేరు బైటకు వస్తోంది. ఇలా బంధువులు సాగిస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల మంత్రి చుట్టూ వివాదాలు చుట్టు ముడుతున్నాయి. దాంతో ప్రతిసారి మంత్రి వర్గ పునర్వవస్ధీకరణ అనే వార్త వచ్చినప్ప్పుడల్లా ముందు మంత్రి పొన్నం పేరు వినిపిస్తోంది. నిజానికి మంత్రి పొన్నం ఎంతో సరదాగా అందరితో కలిసిపోయే నాయకుడు. అలాంటి నాయకుడికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయకూడదన్న ఆలోచనలు బందువుల్లో లేనట్లున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మంత్రి పొన్నం రాజకీయ ప్రస్ధానం ఇప్ప్పుడే మొదలైంది. ఆయనకు ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు వుంది. ఇంకా అనేక ఉన్నత పదవులు పొందాల్సిన కాలం ముందుంది. అలాంటి నాయకుడిని ఇలా బంధువులంతా చేరి రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆఖరుకు మంత్రి పదవే ప్రమాదంలో పడేలా చేస్తున్నారు. తనకు సమాచారం కూడా తెలియని విషయాలపై కూడా మంత్రి పొన్నం సంజాయిషీ చెప్ప్పుకోవాల్సిన పరిస్దితులు బంధువులు సృష్టిస్తున్నారు. మంత్రి పొన్నం ఎదగడం ఇష్టం లేని రాజకీయ ప్రత్యర్ధులు కాచుకొని చూస్తున్నారు. ఆ విషయం మంత్రి పొన్నం బంధువులకు కూడా తెలుసు. అయినా లేని పోని వివాదాలు సృష్టించి, మంత్రి మెడకు చుడుతున్నారు. రవాణ మంత్రిగా ఆయన ఎంతో బిజీగా వుంటారు. తన పదవిలో తల మునకలై వుంటారు. అలాంటి నాయకుడిపై లేని పోని ఆరోపణలు వచ్చేలా చేస్తున్న వారిని కట్టడి చేసుకోవాల్సిన అసవరం కూడా వుంది. ఇంకా పొన్నం ప్రభాకర్‌కు ఎంతో రాజకీయ భవిష్యత్తు వుంది. ఆయన రాత్రికి రాత్రి నాయకుడు కాలేదు. కొన్ని సంవత్సరాలపాటు అటుపార్టీకి, ఇటు ప్రజలకు సేవ చేసి పైకి వచ్చిన నాయకుడు. పైగా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్ధాయిలో అత్యున్నతమైన పదవి ఎనఎస్‌యÖఐ రాష్ట్ర అధ్యక్షుడుగా బాద్యతలు నిర్వర్తించిన నాయకుడు. అలా విద్యార్ధి లోకానికి ఎంతో సేవ చేశారు. ఉన్నత విద్యావంతుడుగా విద్యార్తుల సమస్యýపై అనేక పోరాటాలు చేసి, విద్యార్థుల సంక్షేమం కోసం పోరాటం చేసిన నాయకుడు. అనేక కేసులు ఎదుర్కొన్నారు. జైలు పాలయ్యారు. అలా అటు విద్యార్ధి నాయకుడిగా, ఇటు తెలంగాణ ఉద్యమ కారుడిగా తన జీవితాన్ని పోరాటాలకు అంకితం చేసిన నాయకుడు మంత్రి పదవిలోకి వచ్చి పట్టు మని రెండున్నరేళ్లు కూడా కావడం లేదు. ఆయన చుట్టూ చేరిన వాళ్లు చేస్తున్న చర్యల మÖలంగా మంత్రి వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఆఖరుకు మంత్రి పదవి ప్రమాదంలో పడేలా వుందన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి. చెరువులు నిండినప్ప్పుడు కప్పలు పది వేలు చేరు అని సుమతీ శతకంలో చెప్పినట్లు, పదవిలో వున్నప్ప్పుడు అందరూ చేరుతారు. పదవి లేకుంటే ఏ ఒక్కరు కనిపించరు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version