ఘనంగా ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ జన్మదిన వేడుకలు
మెట్ పల్లి మే 2 నేటి దాత్రి :
టీయూడబ్ల్యూజే (ఐజేయు) ప్రింట్ మీడియా మెట్‌పల్లి ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ పుట్టినరోజు వేడుకలను పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనను శాలువాతో సన్మానించి, కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) మెట్‌పల్లి అధ్యక్షుడు డా. బూరం సంజీవ్, ఉపాధ్యక్షులు జంగం విజయ్, అఫ్రోజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు సాజిద్ పాషా, బాసెట్టి హరీష్, గౌరవ సలహాదారులు దాసం కిషన్, క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, పింజర్ శివ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్, యానం రాకేష్, రఫీ ఉల్లా, సోహెల్, హైమద్, ముత్యాల రమేష్, ఓంకారి శ్రీనివాస్, బొల్లం రాజు, మాజీ అధ్యక్షుడు ఆగ సురేష్, సభ్యులు ఆదిల్ పాషా, రమణ, ఏసమేని గణేష్, ఎండి అభిద్, శశి కుమార్, అమ్ముల ప్రవీణ్, మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుతుబుద్దీన్ పాషా, పట్టణ 20వ వార్డు కౌన్సిలర్ మాసుల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
