సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించిన
◆:- ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ మొగుడంపల్లి మండలం ధనసిరి గ్రామంలో కామి రెడ్డి తండ్రి సాయి రెడ్డి & సరోజా రఘుల్ రెడ్డి ఇల్లు షాక్ సర్క్యూట్ కారణంగా కాలిపోవడం జరిగింది విషయం తెలుసుకున్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు, మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు.బాధితులకు అందాల్సిన నష్ట పరిహారం విషయంలో సంబంధిత అధికారులతో మాట్లాడి అండగా ఉంటాం అని బాధితులకు మనోధైర్యని కల్పించారు.
