శ్రీ రామ్ దళ్ రాష్ట్ర కోశాధికారిగా మచ్చిక రవితేజ
రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపిన రవితేజ
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేటకు చెందిన మచ్చిక రవితేజను శ్రీ రామ్ దళ్ రాష్ట్ర కమిటీ కోశాధికారిగా నియమితులయ్యారు.ఈ నియామకాన్ని రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డి ప్రకటించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కోశాధికారి మచ్చిక రవితేజ మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు నంద్యాల వినయ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.హిందూ ధర్మాలను కాపాడుతూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుస్సాని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
