అధికారుల నిర్లక్ష్యం.. గ్రామస్తులకు శాపం….

అధికారుల నిర్లక్ష్యం.. గ్రామస్తులకు శాపం.

రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం.. ప్రజలకు ఇబ్బందులు.

బాలానగర్ /నేటి ధాత్రి.

బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి గ్రామంలో నిర్మించిన సీసీ రోడ్డు స్థానికులకు సమస్యగా మారింది. రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభాన్ని తొలగించకుండా అలాగే ఉంచి రోడ్డు నిర్మించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.
గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. ఈ రహదారి ద్వారా తమ ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా పెద్ద వాహనాలు తిరగలేకపోవడం, అత్యవసర సమయంలో అంబులెన్స్ వంటి సేవలు చేరుకోవడం కష్టమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుచూపు లేకుండా పనులు చేపట్టిన అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని.. గ్రామస్తులు విమర్శించారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి.. రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version