హనుమాన్ ఆలయ చైర్మన్ పరామర్శించిన రాము, రమేష్ యాదవ్
నెక్కొండ, నేటి ధాత్రి:
మండలంలోని హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ బెజ్జంకి వెంకటేశ్వర్లు తల్లి లక్ష్మీ అనారోగ్యంతో మృతిచెందగా నెక్కొండ సొసైటీ చైర్మన్ మారం రాము, కొమ్ము రమేష్ యాదవ్ లక్ష్మీ మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వెంకటేశ్వర్లుకు మారం రాము రమేష్ యాదవ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ కొమ్మారెడ్డి రవీందర్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ ఈదునూరి యాకయ్య, నెక్కొండ బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బిక్షపతి, నెక్కొండ మాజీ ఉపసర్పంచ్ వీర భద్రయ్య, బి ఆర్ ఎస్ నాయకులు వెంకన్న, శ్రీనివాస్, శ్రీనాథ్, బొడ్డుపల్లి రాజు, తదితరులు పాల్గొన్నారు.