అక్రమ రవాణా 311 క్వింటల్ల ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టివేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
సుమారు 11:00 గంటలకు, మడ్గి గ్రామ శివర్ల లో గల ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద అక్క్రమంగా రవాణా చేస్తున్న, లారీ నెంబర్ GJ37T9543 ని ఆపి తనిఖి చేయగా అందులో, ప్రభుత్వం పేద ప్రజలకు సరఫరా చేసే రేషన్ బియ్యం కలవు. నేరస్తులు 1) చేవ్వ భాస్కర్ 2) రమేష్ ఖజారియా తండ్రి కర్షన్ ఖజారియా వయస్సు 40 సం వృత్తి వ్యాపారం/డ్రైవరు కులం సత్వర్ నివాసం ప్లాట్ నెంబర్ 2 విస్టా రన్ -4 కళ్యాణపూర్, కాంబలియ దేవభూమి ద్వారఖా జిల్లా గుజరాత్ రాష్ట్రం -361315 ఇద్దరు కలిసి శంకర్ పల్లి పరిసర ప్రాంతల రేషన్ వినియోగ దారుల నుంచి తక్కువ ధరలకి కొనుగోలు చేసి అధిక దరలకు అమ్ముటకు గుజరాత్ రాష్ట్రానికి కి జాతీయ రహదారి-65 గుండా అక్రమంగా ఎటువంటి రశీదు పత్రాలు లేకుండా రవాణా తరలిస్తుండగా పోలిస్ వారు మరియు సివిల్ సప్ప్లాయ్ అధికారులు కలిసి వారిని పట్టుకొని లారీ మరియు 311. 20 క్వింటల్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారణ ప్రారంబించానైనది. ఇట్టి రేషన్ బియ్యం విలువ. Rs. 9,95840/- కలదు అని చెరక్ పల్లి ఎస్ఐ కే.రాజేందర్ రెడ్డి తెలిపినారు.