దేశమంతా రాగా జపం!

`ఇక ముందు కనిపించేది రాహుల్‌ కాలం.

`ఓట్ల దొంగతనమంటూ రాహుల్‌ సాగిస్తున్న ఉద్యమం.

`దేశమంతా కదిలుతున్న వైనం.

`ఒక్కసారిగా పెరిగిన ఇమేజ్‌!

`ఈసీకి రాహుల్‌ విసిరిన చాలెంజ్‌!

`మూడాఫ్‌ పొలిటికల్‌ చైంజ్‌.

`ఓట్ల మయాయాజాలంలో మైండ్‌ గేమ్‌.

`ఉక్కిరిబిక్కిరైతున్న ఎలక్షన్‌ కమీషన్‌.

`రోజు రోజుకూ బిజేపిలో పెరుగుతున్న టెన్షన్‌.

`రాహుల్‌ యుద్ధంతో యూత్‌ డైవర్షన్‌.

`రాహుల్‌ గాంధీకి నాయకత్వంపై పెరుతున్న నమ్మకం.

`కాంగ్రెస్‌ పార్టీలో బలపడుతున్న విశ్వాసం.

`ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వస్తున్న సమయం.

`గతం నుంచి రాహుల్‌ చెబుతున్న మాటలన్నీ నిజమౌతున్న సందర్భం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఇప్పుడు దేశమంతా రాగా కాలం నడుస్తోంది. అంటే ఒక రకంగా రాహుల్‌ గాంధీ కాలమన్నమాట. ఈ మాట ఇతర పార్టీలకు నచ్చకోవచ్చు. కాని ప్రజల ఆలోచనలను ఒక నాయకుడు ప్రభావితం చేసినప్పుడు వచ్చే మార్పులో భాగమే ఇది. 2014 ఎన్నికలు ముందుకు దేశమంతా నమో మంత్రాన్ని జపించింది. ఫలితంగా నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు. వరసగా మూడు సార్లు ప్రధానిగా మోడీ ఎన్నియ్యారు. రెండుసార్లు కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం ప్రజలు ప్రతిపక్ష పాత్రను కూడా ఇవ్వలేదు. ఇందుకు కారణాలేమిటో ఇప్పుడిప్పుడే దేశానికి అర్దమౌతోంది. అందుకు కారణాలు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ వెలుగులోకి తెస్తున్నారు. రెండుసార్లు కేంద్రంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం వల్ల రాహుల్‌ గాంధీ ఆనాటి నుంచి చెప్పుకునే అవకాశం పూర్తి స్దాయిలో లేకపోయింది. కనీసం ప్రతిఫక్ష హోదా వున్నా ఎంతోకొంత బాగుండేది. కాని ఆయనుకు ఆ అవకాశం లేకుండాపోయింది. రెండోసారి బిజేపి పార్టీ కేంద్రంలోకి వస్తుందన్న నమ్మకం చాలా మందికి లేదు. ఎందుకంటే అప్పటికే పెరిగిన ధరలు, నోట్ల రద్దులాంటివి ప్రజల మీద తీవ్ర ప్రభావం చూపించాయి. డిజీల్‌, పెట్రోల్‌ చార్జీలు, జిఎస్టీల మోతతో ప్రజలు ఎంతో విసిగిపోయి వున్నట్లు కూడా చర్చించుకునేవారు. కాని అనూహ్యంగా రెండోసారి 2019 ఎన్నికల్లో బిజేపి మరిన్ని సీట్లను పెంచుకుంటూ ఏకంగా 302 సీట్లు గెల్చుకున్నది. ఇక అప్పుడు కూడా ప్రతిపక్షానికి నోరు లేకుండాపోయింది. కాని ఈసారి కాంగ్రెస్‌ పార్టీ 100 సీట్లు సాధించి, ప్రధాన ప్రతిపక్ష హోదా పొందింది. ఇక అప్పటి నుంచి రాహుల్‌ గాందీ తన ప్రతాపం చూపుతూ వస్తున్నాడు. రాజకీయంగా తన బ్యాటింగ్‌ ఎలా వుంటుందో బిజేపికి రుచి చూపిస్తూ వస్తున్నాడు. ఇక తాజగా ఆయన ఈసిపై చేస్తున్న యుద్దం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఎప్పుడైతే పహల్గావ్‌ ఘటన తర్వాత చెప్పాలంటే బిజేపిపై ప్రజలకు వున్న నమ్మకం చాలా వరకు సడలింందనే చెప్పాలి. ఈ సమయంలో బిజేపి, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా నమ్మే పరిసి ్ధతుల్లో ప్రజలు లేకుండాపోయారు. అదే సమయంలో రాహుల్‌ గాందీ అటు క్షేత్ర స్దాయిలో, ఇటు పార్లమెంటులో అధికార బిజేపిని ఒక ఆట ఆడుకుంటూ వస్తున్నారు. ఎన్నికల విషయానికి వస్తే ఏకంగా ఈసిపై తీవ్రమైన కామెంట్లు చూస్తూ వస్తున్నారు. వాటిని నిరూపించే ప్రయత్నంలో చాలా వరకు సక్సెస్‌ అవుతున్నారు. దాంతో మిగతా ప్రతిపక్షాలు 25 కూడా ఆయనకు పూర్తి మద్దతుగా సాగుతున్నాయి. సోమవారం రాహుల్‌ గాందీ సుమారు 300 మంది ఎంపిలతో కలిసి పార్లమెంటు నుంచి నేరుగా ఎలక్షన్‌ కమీషన్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగిన రాష్ట్రాలలో, తర్వాత జరిగిన రాష్ట్రాలలోనూ ఎన్నికల కమీషన్‌, బిజేపికి సపోర్టుగా నిలిచిందని అందుకే బిజేపి వరసుగా గెలుస్తూ వస్తుందని కొన్ని కీలకమైన విషయాలు బైట పెట్టారు. మహారాష్ట్ర, డిల్లీ, హర్యాన, కర్నాకట రాష్ట్రాలలతోపాటు, ఏపికి చెందిన ఎన్నికలపై ఆయన చూపించిన లెక్కలు అందర్నీ దిగ్రాంతికి గురిచేస్తున్నాయి. అందుకే దేశ వ్యాప్తంగా బిజేపిపై వ్యతిరేకత పెరుగుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. దాంతో దేశ వ్యాప్తంగా రాహుల్‌ ఇమేజ్‌ ఒక్కసారిగా ఎంతో పెరిగిపోయింది. ఇక దేశంలో కాంగ్రెస్‌ తారాజువ్వలా పుంజుకుంటోంది. దేశ వ్యాప్తంగా రాహుల్‌గాంధీకి విపతీరీతంగా మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా యువతలో రాహుల్‌ గాందీ మీద క్రేజ్‌ పెరుగుతోంది. 2014కు ముందు ప్రదాని మోడీకి వచ్చినట్లే ఇప్పుడు రాహుల్‌కు కూడా జనం నీరాజనం పడుతున్నారు. బలమైన ప్రతిపక్షం వుంటే తప్ప రాజకీయాల్లో మార్పులు రావు. 2014,2019లలో ప్రజలు ప్రతిపక్షం లేదు. బలమైన కేంద్ర ప్రభుత్వం బిజేపి రూపంలో ఏర్పాటైంది. ఏక పార్టీ పాలన విదానంలో ఒంటెద్దు పోకడలు కనిపించాయి. ప్రజా సమస్యలు ప్రస్తావించేవారు లేకుండాపోయారు. ప్రతిపక్షాల వాదనలు పత్రికలు కూడా రాయలేకపోయాయి. ప్రధాని మోడీ చెప్పిందే నిజమని నమ్మారు. బిజేపి ఆలోచనలే దేశానికి శ్రీరామరక్ష అనుకున్నారు. మొన్నటి దాకా బిజేపి నాయకులు రాహుల్‌ గాందీని పప్పు అంటూ నిందించారు. రాహుల్‌ ది ఏ కులమంటూ ఎద్దేవా చేశారు. లేనిపోని కల్పిత కథలన్నీ చెప్పారు. జనాన్ని నమ్మించాంచారు. డామిట్‌ కథ అడ్డం తిరుగుతోంది. రాహుల్‌ నాయకత్వం, సమర్ధత మీద చర్చ మొదలైంది. దేనికైనా సరే సమయం రావాలి. కావాలి అంటారు. ఇప్పుడు అదే నిజమౌతోంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అప్రతిహాతంగా పాలన సాగిస్తున్న సమయంలో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం చూశారు. బిజేపిని బలపర్చారు. కాంగ్రెస్‌కు సమాంతరంగా గెలిపిస్తూ వచ్చారు. ఆఖరుకు కాంగ్రెస్‌కు కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా లేకుండా చేశారు. ప్రజలు ఎంతైనా విజ్ఞులు. తాము కోరుకున్నట్లు పాలన సాగాలనుకోవడం ప్రజల నిర్ణయం. ప్రజా నిర్ణయమే అంతిమ తీర్పు. అందుకే 2014 నుంచి బిజేపికి దేశ ప్రజలు పట్టం కట్టారు. రాష్ట్రాలలో కూడా కాషాయజెండా ఎగురవేశారు. ఇప్పుడు బిజేపికి గడ్డు కాలం మొదలైంది. గత ఎన్నికల్లో అప్‌కీ బార్‌ బిజేపి సర్కార్‌ అనే నినాదాన్ని జనం సంపూర్ణంగా విశ్వసించలేదు. బిజేపికి మద్దతు తెలపలేదు. కాకపోతే బిజేపిని అధికారం దరిదాపుల్లోకి తెచ్చి వదిలిపెట్టారు. దాంతో మళ్లీ సంకీర్ణ సర్కారు కేంద్రంలో ఏర్పాటైంది. ఇక అప్పటి నుంచి బిజేపి అవస్దలు ఎదుర్కొంటోంది. గత పదేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి బిజేపికి ప్రశ్న అనే పదమే వినిపించలేదు. బిజేపిదాకా ఆ పదమే చేరుకోలేదు. ఓసారి బిజేపికి అవకాశమిద్దామనుకున్న ప్రజలు కూడా కాంగ్రెస్‌ ప్రశ్నలు వినిపించుకోలేదు. దానికి తోడు బిజేపి చెప్పిన ప్రతి విషయాన్ని నిజమే అని నమ్మారు. దేశం కోసం, ధర్మం కోసం అని బిజేపి చెప్పే మాటలను ప్రజలు బలంగా నమ్మారు. ముఖ్యంగా కశ్మీర్‌ అంశంలో ఎప్పటి నుంచో సాగుతున్న, నానుతున్న సమస్యలన్నీ బిజేపి వల్లనే తీరుతాయని జనం నమ్మారు. అది ప్రధాని మోడీ నేతృత్వంలోనే సాధ్యమౌతుందనుకున్నారు. కాని ఇప్పుడు కథ అడ్డం తిరుగుతోంది. ఎప్పుడైతే పహల్గావ్‌ దాడి తర్వాత ప్రజల్లో బిజేపిపై వున్న నమ్మకం క్రమంగా సడలుతోంది. ఎనుకున్న ప్రజలే ప్రశ్నించొద్దనే రాజకీయ పార్టీని ప్రజలే మళ్లీ పక్కన పెడతారన్న విషయాన్ని పార్టీలు మర్చిపోతున్నాయి. అందుకే పహల్గావ్‌ దాడిపై ఎవరూ మాట్లాడకుండా ఎత్తులు వేశారు. కాని కేంద్రంలో ఈసారి బలమైన ప్రతిపక్షం వుండడంతో అసలు విషయాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయంలో బిజేపిపై ప్రజలు ఎంత కోపంతో వున్నారో కూడా కనిపిస్తోంది. పహల్గావ్‌ దాడి విషయంలో బిజేపి వేసిన విన్యాసాలు ప్రజలు నిషితంగా గమనిస్తూ వచ్చారు. బిజేపి చెప్పే మాటలకు, చేసే చేతలకు ఎలాంటి పొంతన వుండడం లేదని గ్రహించారు. పైగా పాకిస్తాన్‌తో యుద్దం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీజ్‌ ఫైర్‌ ప్రకటన భారతీయులను ఆశ్చర్యాలకు గురి చేసింది. ఆపరేషన్‌ సింధూర్‌ అని పేరుతో రంగంలోకి దిగగానే దేశ ప్రజలంతా ఎంతో సంతోషించారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెబుతారని ఊహించారు. కాని అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ సీజ్‌ ఫైర్‌ను ప్రకటించడాన్ని దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. ఇక ఇక్కడి నుంచి బిజేపిపై ప్రజల్లో ఒక రకమైన భావన మొదలైంది. తాజాగా ఆపరేషన్‌ మహాదేవ్‌ జరిపి, ఉగ్రవాదులను మట్టుబెట్టామని కేంద్రం చెప్పినా జనంలో స్పందన కరువైంది. ఆపరేషన్‌ సిందూర్‌ ఆగలేదని చెప్పిన కేంద్రం, మళ్లీ ఆపరేషన్‌ మహదేవ్‌ ఎప్పుడు తెచ్చింది? అనే అనుమానంలోనే వున్నారు. ఇలా వరుస సంఘటనలతో కాంగ్రెస్‌ పార్టీ గత పాలనపై దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ద సమయంలో ఇందిరాగాంధీ చూపిన చొరవపై పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఆమె అప్పటి అమెరికా ప్రెసిడెంట్‌ రీగన్‌తో నేరుగానే తమ దేశ రాజకీయ, సార్వభౌమత్వంలో ఎవరి జోక్యం అవసరం లేదని తేల్చి చెప్పింది. పాకిస్తాన్‌ను రెండుగా చీల్చేసింది. పాకిస్తాన్‌ నుంచి బంగ్లాదేశ్‌ను వేరు చేసింది. ఆ సమయంలో ప్రపంచమంతా ఇందిరాగాందీని కొనియాడిరది. బిజేపి నాయకుడు మాజీ ప్రదాని అటల్‌ బిహారి వాజ్‌పాయ్‌ సైతం ఇందిరాగాందీని అపర కాళికా దేవి అంటూ కీర్తించారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు గత పది సంవత్సరాలుగా ఎంత చప్పగా సాగాయో, ఇప్పుడు అంత హాట్‌గా సాగుతున్నాయి. ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇందిరాగాంధీ ధైర్యంలో కనీసం సగం వున్నా అమెరికా అద్యక్షుడు ట్రంప్‌ చెప్పింది అబద్దమని చెప్పంటూ ప్రతిపక్ష నేత రాహుల్‌ సవాలుతో ఒక్కసారిగా రాజకీయాలు యూటర్న్‌ తీసుకున్నాయి. ప్రతిపక్షాలు అదికార బిజేపిని చెడుగుడు ఆడుకుంటున్నాయి. అయితే రాహుల్‌ గాంధీ గత ఎన్నికల ముందు రాహుల్‌ జోడో యాత్ర చేసిన సమయంలోనే దేశమంతా ఆయనపై కొంత నమ్మకం మొదలైంది. తర్వాత ఆయన ప్రజలకు చేరువౌతున్న తీరు దేశమంతా గమనిస్తూ వచ్చింది. ప్రపంచంలో ఏం జరుగుతోంది. మన దేశంలో ఏం జరుగుతుందో ఆయన ఎంత చెప్పినా జనం వినడానికి సిద్దంగా వున్నా, ప్రచార సాధనాలు సహకరించలేదు. కాని ఇప్పుడు ఆయన ఏది చెబితే అది జనం వింటున్నారు. గతంలో ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరుగుతోంది? కోవిడ్‌ సమయంలో రాహుల్‌ ఏం చెప్పారు. అదే ఎలా నిజమైంది? రాజ్యాంగ స్పూరిని గురించి వివరించడం అందరూ ఆసక్తిగా వింటున్నారు. ఇంగ్లీషు వల్ల లాభమేమిటి? హిందీని బలవంతంగా రుద్దితే ఏం జరుగుతుంది? ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలపై రాహుల్‌ చెప్పే ప్రతి మాట జనానికి చేరుతోంది. పైగా ప్రతిపక్షాలు కూడా రాహుల్‌ బాటలోకి వచ్చేస్తున్నారు. దాంతో రాహుల్‌ ఇమేజ్‌ ఇటీవల కాలంలో అమాంతం పెరిగింది. కాంగ్రెస్‌ పార్టీ బలం దేశ వ్యాప్తంగా పెరుగుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version