ఆదివాసుల హక్కులపై ఈ నెల 24న బహిరంగ సభ
భూపాలపల్లి నేటిధాత్రి
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా ఈ నెల.24న హన్మకొండ అంబేద్కర్ భవన్ లో ఆదివాసుల హక్కులపై అవగాహన సభను విజయవంతం చేయాలని ఏఐఎఫ్ టీయు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. ఏం .రాయమల్లు
రాష్ట్ర నాయకులు. చంద్రగిరి శంకర్. పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
ఆదివాసీ హక్కులు, కార్పొరేటీకరణ, ఆపరేషన్ కగార్ హత్యాకాండ, కాల్పుల విరమణ ,పెసా తదితర ఆదివాసి చట్టాలు పరిరక్షించబడాలని, మావోయిస్టుల,పేరుతో ఆదివాసి జాతి హననానికి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ పాశవిక నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలు తరలిరావాలని ప్రధానంగా మధ్య భారతంలోగల దండకారణ్య ప్రాంతంలోని
అపారమైన ఖనిజ సంపాదను
ఆదాని. అంబానీలకు. బడా కార్పొరేట్ సంస్థలకు. అప్పనంగా దోచిపెట్టడం కోసం. మోడీ. అమిషాల. ప్రభుత్వం
ఆదివాసీల హననానికి పాల్పడుతూ . ఆదివాసులకు అండగా ఉన్నా. మావోయిస్టు ఉద్యమకారులను. పట్టుకొని చిత్రహింసలు పెట్టి. ఎదురు కాల్పుల పేరట. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అతి కిరాతకంగా
మావోయిస్టులను. అమాయకులైన ఆదివాసులను.
కాల్చి చంపడం జరుగుతుంది
ప్రశ్నించే ఉద్యమకారులపై. పౌర హక్కుల సంఘాలపై. అక్రమ కేసులు బనాయిస్తూ. జైలు పాలు చేస్తున్నారు. మోడీ. అమిషా. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా
పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఎన్కౌంటర్ల పేరుతో అణిచివేస్తున్న ఆదివాసీల ఉద్యమకారుల జీవించే హక్కును రక్షించుకోవాలని, బస్టర్ లో ఏర్పాటు చేసిన వందలాది సాయుధ బలగాల క్యాంపులను వెంటనే ఎత్తివేసి కేంద్ర ప్రభుత్వం
మావోయిస్టులతో శాంతి చర్చలను కొనసాగించాలని, తక్షణం కాల్పుల విరమణను ప్రకటించాలని, పోలీసు బలగాలను . వెనక్కి రప్పించాలని .భారత రాజ్యాంగంలొ ఆదివాసి లకు కల్పించబడిన హక్కులన్నింటినీ అమలు చేయాలని, 1996 పెసా చట్టం .2006 అటవీ హక్కుల చట్టం 5-6- షెడ్యూల్ లను.
గ్రామ సభల తీర్మానాలను అమలు చేయాలని. నర మేధాని నిలిపివేసి. దేశంలో శాంతిని నెలకొల్పాలని. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
