*ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించే ఏకైక సంఘం పీఆర్టీయు*
నడికూడ,నేటిధాత్రి:
ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కరించి వారికి ఎల్లప్పుడూ అండగా ఉండే ఏకైక సంఘం పీఆర్టీయూ టీఎస్ మాత్రమే అని హనుమకొండ జిల్లా పీఆర్టీయు ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి అన్నారు. గురువారం రోజు నడికూడ మండల శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి పలిత శ్రీహరి చేతుల మీదుగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉపాధ్యాయ లోకానికి ఎన్నో సౌకర్యాలు కల్పించిన సంఘం పీఆర్టీయూ మాత్రమే అని, అతి త్వరలోనే జిపిఎఫ్ పెండింగ్ బిల్లులు అన్నీ చెల్లించే దిశగా సంఘం కృషి చేస్తుందని,మిగతా పెండింగ్ బిల్లులు అన్నీ కూడా సాధ్యమైన తొందరగా క్లియర్ చేయించే ప్రయత్నం చేస్తామని,ఉపాధ్యాయ బదిలీలు,పదోన్నతులు ఇప్పించిన సంవత్సరంలోనే మళ్ళీ త్వరలోనే పదోన్నతులు కల్పించే దిశగా పిఆర్టియు టి ఎస్ సంఘం కృషి చేస్తుందని,ఇంకా ఎన్నో సమస్యలు త్వరలోనే పరిష్కరించే దిశగా సంఘం కృషి చేస్తుందని అన్నారు. మండలంలోని కంఠాత్మకూర్, కౌకొండ,నడికూడ,వరికోల్, రాయపర్తి, నార్లాపూర్, చర్లపల్లి,పులిగిల్ల ఉన్నత పాఠశాలలు తిరిగి సభ్యత్వం నమోదు చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు అచ్చ సుదర్శన్ ప్రధాన కార్యదర్శి కట్టుకోజ్వాల సతీష్,రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మోడం రాజేందర్ బాబు,నన్నేసాహెబ్,శ్రీధర్ రెడ్డి, బురుగు శంకర్ జిల్లా బాధ్యులు శరత్ గౌడ్,నగేష్ పాల్గొన్నారు.