ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేత
నడికూడ,నేటిధాత్రి:
నడికూడ మండలంలోని సర్వాపూర్ గ్రామంలో ముగ్గుల పోటీలు ఇనుగాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గ్రామ సర్పంచ్ భోగి శ్రీలత,ఉప సర్పంచ్ దండు లక్ష్మయ్య గ్రామంలో 6 సం” నుండి 14 సం”లోపు ఆడపిల్లలకు చదువు తో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలో విజయం సాధించిన పిల్లలకు ప్రధమ, ద్వితీయ,తృతీయ బహుమతులు అందించారు. అంతేకాకుండా పోటిలలో ధైర్యంగా పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి పరీక్షాప్యాడు లు అందించారు.ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ ప్రియాంక, సుమలత,సుమన్,నాగరాజు, సురేష్,రాధిక తదితరులు పాల్గొన్నారు.
