సర్పంచి ఉప సర్పంచిని సన్మానించిన సినీ గేయ రచయిత మిట్టపల్లి.
చిట్యాల నేటి ధాత్రి, :
కర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో మిట్టపల్లి మిత్ర మండలి వ్యవస్థాపక సభ్యులు పుల్ల సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికో బడిన చిట్యాల సర్పంచి తౌటం లక్ష్మీ అంతయ్యను ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్ ను వార్డు మెంబర్లను శుక్రవారం రోజున శాలువాతో ఘనంగా సన్మానించిన సినీగేయ రచయిత మిట్టపల్లి సురేందర్, ఈ సందర్భంగా మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ నూతన సర్పంచికి ఉపసర్పంచ్కి పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఉన్నత పదవులను పొంది గ్రామాన్ని అభివృద్ధిలో నడిపిస్తూ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని అన్నారు, అనంతరం ఉపసర్పంచి బుర్ర వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ మా ప్రాంతం నుంచి సినీ గేయ రచయితగా ఎన్నో సినిమాలకు పాటలు రాసి మా ప్రాంతాన్ని ప్రపంచానికి పరిచయంచెసినా మిట్టపల్లి సురేందర్ ను అభినందిస్తూ పాలకవర్గం నుండి ఘనంగా శాలువాతో సన్మానించడం జరిగిందని, అలాగే మిట్టపల్లి సురేందర్ అద్భుతమైన పాటలు రాసి అనేక అవార్డులు సాధించాలని ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు మైదం శ్రావ్యా, పుల్ల నిర్మల, బోళ్ల చందు, తౌటమ్ నవీన్,మిట్టపల్లి మిత్రమండలి వ్యవస్థాపకులు పుల్ల సతీష్ కుమార్, బండ దేవేందర్ గోల్కొండ బుచ్చన్న, ఈశ్వర్ మహేందర్,అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్, గురుకుంట్ల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
