బిఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్ట్…
ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేయడం సిగ్గుచేటు…
బిఆర్ఎస్వి నాయకులు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేయించడం సిగ్గుచేటని రామకృష్ణాపూర్ పట్టణ బిఆర్ఎస్వి నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. ఐక్య విద్యార్థి సంఘాల పిలుపుమేరకు హలో హైదరాబాద్ చలో గాంధీ భవన్ ముట్టడి, నిరసన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులు బిఆర్ఎస్వి నాయకులు రామిడి లక్ష్మీకాంత్, చంద్ర కిరణ్, గోనే రాజేందర్, కుర్మ దినేష్, మాచర్ల కుమార్, కాంపల్లి శ్రీకాంత్ లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్వి నాయకులు మాట్లాడారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని అన్నారు.ఆరు గ్యారెంటీలు అమలు అయ్యే వరకు పోరాటం ఆగదని అన్నారు.