శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పొత్తి పాశురం దీపోత్సవం
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గురువారం నాడు పొత్తి పాశురం శ్రీ స్వామివారికి దీపోత్సవం మంగళ హారతులు ప్రత్యేక పూజలు నిర్వహించామని ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథం చార్యులు పురోహితులు శ్రీ ఉత్సవ్ ఒక ప్రకటనలో తెలిపారు పూలమాల గోదాదేవి అమ్మవారి సేవలో 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉoగుళం తిరుమల్ అలేఖ్య దంపతులు మారం విజయ్ దంపతులు శ్రీను దంపతులు పాల్గొన్నారు పొత్తి పాశురం స్వామి వారి దగ్గర స్వామివారి అలంకరణతో ముగ్గును శ్రీమతి అంగడి లావణ్య వేశారని 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీమతి అలేఖ్య తిరుమల్ అంగడి నరేందర్ రాజేశ్వరి నర్మదా సరస్వతి లగిశెట్టి సాయి ప్రసాద్ కట్ట సుబ్బయ్య కృష్ణమోహన్ శ్రీదర్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు
