గాంధీ లక్ష విగ్రహాల పోస్టర్ ఆవిష్కరణ
నేటిధాత్రి, వరంగల్.
గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ట్రస్ట్ సభ్యులు రాష్ట్ర మంత్రులైన కొండ సురేఖ, ధనసరి సీతక్క హనుమకొండ, వరంగల్ జిల్లాలోని పలు నియోజకవర్గాల శాసనసభ్యులైన నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, కె.ఆర్ నాగరాజు లను మర్యాదపూర్వకంగా కలిసి వారిచే బాపుబాట గాంధీజీ లక్ష విగ్రహాల పోస్టర్ ను ఆవిష్కరింపజేశారు. అనంతరం గాంధీ గురించి శాసనసభ్యులు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితకాల సేవలు భారతదేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గాలను ఉపయోగపడ్డాయని, ప్రపంచవ్యాప్తంగా పౌర హక్కులు, స్వేచ్ఛా ఉద్యమాలకు ప్రేరణగా నిలిచాయని అన్నారు. అక్టోబర్ 10 నుండి 14వ తేదీ వరకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరగబోయే మహాత్మా గాంధీ జాతీయ సుస్థిర విజ్ఞాన సదస్సును విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ గాంధీ, గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి, ఏఐసీసీ కోఆర్డినేటర్ పులి అనిల్, రాష్ట్ర కమిటీ సభ్యులు సంజయ్ రెడ్డి, సాయి చంద్, సంతోష్ రెడ్డి, పలు యువజన కమిటీ నాయకులు పాల్గొన్నారు.
