`తెలంగాణా రాజకీయాలలలో కొత్త సమీకరణాలు.
`ఎన్నికల నాటికి ఎన్ని పొత్తులు ఉంటాయో!

`బీఆరఎస్ అడుగులపైనే అందరి దృష్టి.
`తమిళనాడు, బెంగాల్ ఎన్నికలను ఆధారం చేసుకొని రాజకీయాలు మారొచ్చు.
`దక్షిణానా బీజేపీ ప్రభావం ఈ ఎన్నికలతో తేలిపోతుంది.
`ఏ మాత్రం బీజేపీ ప్రభావం కనిపించినా తెలంగాణా లోకి టీడీపీ వస్తుంది.
`ఆ వెనుకే జనసేన దూరుతుంది.
`కూటమి జత కట్టి తెలంగాణా మీద పెత్తనం మొదలుపెడుతుంది.
`ఈ సారి ఒంటరిగా బీజేపీ బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు.
`బీఆరఎస్ తో పొత్తుకు అవకాశం ఉండకపోవచ్చు.
`కాంగ్రెస్ తో ఏ పార్టీ జత కట్టక పోవచ్చు.
`కాంగ్రెస్ పిలిచి కోరినన్ని సీట్లు ఇస్తామన్నా ఏ పార్టీ ముందుకు రాకపోవచ్చు.
`ఆరు గ్యారెంటీలు ఆఖరులో అమలు చేసినా ఫలితం పెద్దగా ఉండక పోవచ్చు.
`ఇప్పటికీ సమయం మించిపోలేదు.
`అమలు చేయాలంటే ఖజానా లో సరుకు లేదు.
`తులం బంగారం ఇవ్వడం సాధ్యమయ్యే పని కాదు.
`పింఛన్లు పెంపకానికి ఒక అడుగు పడొచ్చు.
`అది కూడా మొత్తం పెంపు సాధ్యం కాకపోవచ్చు.
`కేసీఆర్ అప్పుల కుప్ప చేశాడన్న మాటలు జనం నమ్మకపోవచ్చు.
`ఐదేళ్ల అధికారమే ప్రజల తీర్పుకు గడువు.
`అది దాటినా ఇయ్యలేకపోతే ప్రజలు కోరుకునేది ఒక్కటే మార్పు.
`ఏ మార్పు కాంగ్రెస్ ను గెలిపించిందో అదే మార్పు దించేయొచ్చు.
`అధికారం కాంగ్రెస్ కోల్పోతే భవిష్యత్తులో తెలంగాణాలో చోటు ఉండకపోవచ్చు
హైదరాబాద్, నేటిధాత్రి:
దేశంలో ప్రాంతీయ పార్టీలు మళ్లీ పుంజుకోనున్నాయా? ఉత్తరాదిలో ఇప్పటికే అంతరించిపోయే దశకు చేరుకున్న కొన్ని పార్టీలు మళ్లీ పవర్‌లోకి వస్తాయా? అనేది కొంత ఆగితే తెలిసిపోయే వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికైతే దేశంలో ప్రాంతీయ పార్టీల మందగనం కనిపిస్తోంది. కొన్ని చోట్ల అంతరించిపోయే దశకు చేరుకునేలా వున్నాయనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఏలుతున్న తరుణం నుంచి కొన్ని ప్రాంతీయ పార్టీలు ఏకకాలంలో పురుడుపోసుకున్నాయి. వాటిలో బిజేపి కూడా ఒకటని చెప్పకతప్పదు. బిజేపి పుట్టిన వేళా విశేషమో ఏమో కాని, ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరిగిపెద్దదైంది. కాంగ్రెస్‌ను కనుమరుగు చేసే దశకు చేరుకున్నట్టే కనిపించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 సీట్లు రావడంతోమళ్లీ కాంగ్రెస్‌ను పూర్తిగా లేకుండా చేయడం బిజేపి వల్ల కూడా సాద్యం కాదని తేలిపోయింది. గతంలో ఎప్ప్పుడూ బిజేపి ఇంత బలంగా లేదు. వాజ్‌పాయ్ ప్రధాని కావడానికి అవసరమైన సీట్లు ఆనాడు సాదించినా, ఎన్డీయే కూటమి ద్వారానే సాధ్యమైంది. తర్వాత కాలంలో పూర్తిగా అడుగంటిపోయే పరిస్దితి ఏనాడు బిజేపికి రాలేదు. నరేంద్ర మోడీ ప్రధాని అనే పదం వినగానే దేశంలో బిజేపికి పూనకం వచ్చినట్లే పుంజుకున్నది. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కాకపోతే ఎలా పెరిగిందో అలా తగ్గుతుదా? అనుకుంటే కూడా అలాంటి పరిస్ధితులు కనిపించడం లేదు. దానికి బిజేపి చెప్పే బాష్యం ఒక రకంగా వుంటుంది. ప్రతిపక్షాలు చేసే ఆరోపణలు మరో రకంగా వుంటాయి. ఏది ఏమైనా ఇప్పటికిప్ప్పుడు బిజేపి పునాదులు పెకిలించే శక్తి కాంగ్రెస్‌కు లేదు. ఎందుకుంటే చెప్ప్పుకునేందుకు పట్టుమని పదిరాష్ట్రాలు కూడా కాంగ్రెస్ చేతిలోలేవు. వున్న మూడింటిలో రెండు దక్షిణాదిన వున్నాయి. ఒక్కటి ఉత్తరాధిన వుంది. చేతిలో వున్న పంజాబ్‌ను కూడా చేజేతులా పోగొట్టుకున్నది. చీపురు చేతిలో పడి ఊడ్చుకుపోయింది. అక్కడ మళ్లీ అవకాశం వస్తే బిజేపికి ఆ రాష్ట్రం దక్కుతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. పక్కనే వున్న హర్యానాలో కాంగ్రెస్ అదికారంలోకి వచ్చినంత హడావుడి కనిపించింది. ఆఖరుకు ఏమైంది? కాంగ్రెస్ బొక్కా బోర్లాపడింది. గత ఎన్నికల్లో బిజేపి పూర్తి మెజార్టీ సాధించకోవడంతో మళ్లీ ఎన్డీయే కూటమి వల్లనే నేడు బిజేపి కేంద్రంలో అధికారం నిలుపుకోగలింది. ఎలా చూసినా బిజేపికి కాలం మరోసారి కలిసివచ్చింది. అదే సమయంలో కాంగ్రెస్ వంద స్ధానాలు గెల్చుకోగలిగింది. 400 సీట్లు సాదిస్తామనుకున్న బిజేపి, 240కి పరిమితమైంది. అక్కడితో డౌన్ ఫాల్ స్టార్టు అవుతుందని అందరూ అనుకున్నారు. కాంగ్రెస్ ఎన్నో కలలు కన్నది. కాని ఆ కలలు కాంగ్రెస్‌కు పగటి కలలనే మిగిల్చాయి. వరస ఎన్నికల్లో బిజేపి జయకేతనం ఎగురవేస్తూ వస్తోంది. హర్యానా, డిల్లీ, బిహార్ ఇలా రాష్ట్రంలో చూసినా బిజేపి తిరుగులేని మెజార్టీ సాధిస్తూవస్తోంది. కాంగ్రెస్‌ను మట్టికరిపిస్తూ వస్తోంది. ఇక ఇప్ప్పుడు ఐదు రాష్ట్రాలఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాని అక్కడ కూడా బిజేపి వస్తుందా? లేదా? అనేది ఫలితాలు వస్తే గాని తెలియదు. అస్సాంలో ఒక వేళ ఫలితాలు తిరగబడితే బిజేపికి ఇబ్బందికరమే. కాని పిరస్ధితులు అలా కనిపించడం లేదన్న మాటలే వినిపిస్తున్నాయి. కేళరంలో ఒక వేళ బిజేపి అధికారంలోకి రాకపోయినా, సీట్లపరంగా క్రియాశీలక శక్తిగా మారే అవకాశం వుంటే మాత్రం ఇక బిజేపిని ఆపడం కష్టం. కాంగ్రెస్ జాతీయ ీVAదాకు చరమగీతం పాడుకోవాల్సిన పరిస్దితి రావడం ఖాయం. ఎందుకంటే తమిళనాడులో కాంగ్రెస్ ఆది నుంచి పేరు మాత్రమే వుంటోంది. డిఎంకే దయాదాక్షిణ్యాల మీద బతుకుతోంది. అక్కడ కాంగ్రెస్‌కు చాన్సులేదు. డిఎంకేను కాదని ఒంటరిపోరు జరిపే పరిస్ధితి కనిపించడం లేదు. డిఎంకే కాకుండా ఏఐడిఎంకే కాంగ్రెస్‌తో పొత్తు సాగదు. కొత్తగా వచ్చిను టివికే విజయ్ ఎవరితో వెళ్తారనేది ఇప్పటికిప్ప్పుడు చెప్పే పరిస్దితి లేదు. బెంగాల్‌లో మమత మళ్లీ అధికారంలోకి వస్తుందా? రాదా? అనే చర్చ ఎలా వున్నా, ఇప్పటికే మూడు సార్లు మమతకు ప్రజలు అవకాశమిచ్చారు. బెంగాల్ ప్రజలు గతం నుంచి అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. గతంలో ఏకచ్చత్రాదిపత్యంగా కమ్యూనిస్టులు పాలిస్తూ వచ్చారు. దాని ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాలను కమ్యూనిస్టులు ఏలారు. లేకుంటే కీలక భూమిక పోషించారు. కమ్యూనిస్టుల కంచుకోటలు ఎప్ప్పుడో కూలిపోయాయి. బెంగాల్‌లో గత పదిహేనేళ్లుగా ఉనికి కోసం పాకులాడుతున్నాయి. ఈసారి బిజేపి జయకేతనం ఎగురవేస్తే మాత్రం దేశంలో, ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలకు ప్రాపకం చెల్లదు. ఆ పార్టీల ఉనికి కష్టంగా మారొచ్చు. ఎందుకంటే మహారాష్ట్ర ఒకప్ప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోట. తర్వాత శివసేన కీలకపాత్ర పోషించాయి. కాని ఆప్ప్పుడెప్ప్పుడూ శివసేన అదికారంలోకి వచ్చింది లేదు. ఎన్సీపీకి కూడా అంత సీన్ లేదు. బిజేపిని కాదని గెలిచే పరిస్దితి ఏ పార్టీకి లేదు. కాంగ్రెస్‌కే దిక్కులేని పరిస్ధితులు, ఇతర ప్రాంతీయ పార్టీలకు చోటే లేకుండాపోతోంది. ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఎస్పీ, బిఎస్పీలు కూడా ఉనికి కోసం ఆరాపడుతున్నాయి. అందులో బిఎస్పీ అట్టడుగు స్ధానానికి చేరుకున్నది. ఇక ఎస్పీ మాత్రమే పోరాటంలో వుంది. అక్కడ కాంగ్రెస్‌కు కూడా చోటు లేకుండాపోయింది. ఎస్పీ ఇచ్చే సీట్ల మీద ఆదారపడి రాజకీయం చేయాల్సి వస్తోంది. ఇన్ని పరిస్దితుల మధ్య ఒక వేళ బెంగాల్‌లో మళ్లీ తణమూల్ అధికారంలోకి వస్తే మాత్రం దేశంలో జాతీయ పార్టీలకు కౌండ్ డౌన్ స్టార్ట్ అయినట్లే అని చెప్ప్పుకోవచ్చు అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అప్ప్పుడు దేశంలో ప్రాంతీయ పార్టీలకు మళ్లీ ఆదరణ మొదలయ్యే అవకాశాలు లేకపోలేదు. ఉత్తరాదిన ఒక్కసారి ఆ ఊపు మొదలైందంటే దక్షిణాదిన ఇప్పటికే అంతంత మాత్రంగా వున్న జాతీయ పార్టీలు బిజేపి, కాంగ్రెస్‌కు కూడా తట్టాబుట్టా సర్ధుకునే పరిస్దితులు రావొచ్చు. బెంగాల్‌లో బిజేపి గెలిస్తే రేపటి రోజు తెలంగాణలో కూడా బిజేపి బలం పెంచుకోవచ్చు. కాంగ్రెస్ డౌన్ ఫాల్ మళ్లీ మొదటికి రావొచ్చు. అదే సమయంలో ఎంత ప్రయత్నం చేసినా కాంగ్రెస్‌కు గడ్డుకాలం మొదలు కావొచ్చు. అయితే అప్ప్పుడు బిఆరఎస్ పరిస్తితి ఏమిటి? అనేది కూడా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బెంగాల్‌లో బిజేపి గెలవకపోతే, తమిళనాడులో బిజేపి ప్రభావం కనిపించపోతే మాత్రం ప్రాంతీయపార్టీలకు ఇక కాýం కలిసివచ్చినట్లే. ఉత్తరాదిన ఆఫ్ లాంటి పార్టీలు శరవేంగంగా విస్తరించొచ్చు. ఆఖరుకు బిఎస్పీ కూడా ఉత్తర ప్రదేశ్‌లో కోలుకొవచ్చు. ఎస్పీ, బిఎస్పీలు రాజ్యమెలొచ్చు. తెలంగాణలో బిఆరఎస్ బలం మరింత పెరగొచ్చు. తెలంగాణలో బిఆరఎస్ ఎదరులేని శక్తిగా మారొచ్చు. తిరుగులేని విజయం సొంతం చేసుకోవచ్చు. కాని కాంగ్రెస్‌కు మాత్రం అంతంత మాత్రానికి మళ్లీపడిపోవచ్చు. ఇప్పటికిప్ప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నా జనం నమ్మకపోవచ్చు. కాకపోతే ఆరు గ్యారెంటీలను అమలు చేసే ధైర్యం చేసినా, ఏక కాలంలో అవి సాద్యం కాకపోవచ్చు. పించన్లు ఏకబిగిన రూ.4వేలు చేయకపోవచ్చు. కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం అనేది ఇచ్చేందుకు అవకాశం లేదు. ప్రతిమహిళలకు రూ.2500 అనేవి సాధ్యమయ్యేలా లేవు. విద్యార్ధినులకు స్కూటీలు అందజేయడం జరిగే పని కాకపోవచ్చు. ఇలా ఆరు గ్యారెంటీల మీద జనం కూడా ఆశ వదులుకున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రేవంత్ సర్కారు ఇచ్చే పరిస్ధితి లేదని ప్రజలు కూడా అడిగేందుకు సిద్దంగా లేదు. ఖజానా ఖాళీ అని సిఎం. రేవంత్ పదే పదే చెప్పి ఒక మంచి పని చేశారు. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలనుకున్నట్లున్నారు. మొత్తం ఖుల్లం ఖుల్లం చెప్పేశారు. కాకపోతే మళ్లీ గెలిపిస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పడానికి కూడా కాంగ్రెస్ సాహసం చేయకపోవచ్చు. అందుకే తెలంగాణ రాజకీయాలు బిఆరఎస్ వైపు చూస్తున్నాయని చెప్పడానికి సందేహం కూడ అవసరంలేని వాతావరణం కనిపిస్తోంది.